Share News

కోకాపేట్ ఓఆర్ఆర్‌పై లారీని ఢీకొన్న ఎలక్ట్రిక్ కారు.. నలుగురికి తప్పిన ప్రాణాపాయం..

ABN , Publish Date - Nov 20 , 2026 | 09:05 AM

రంగారెడ్డి జిల్లా కోకాపేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఓ ఎలక్ట్రిక్ కారు బలంగా ఢీకొట్టింది.

కోకాపేట్ ఓఆర్ఆర్‌పై లారీని ఢీకొన్న ఎలక్ట్రిక్ కారు.. నలుగురికి తప్పిన ప్రాణాపాయం..
Kokapet Road Accident

రంగారెడ్డి జిల్లా: కోకాపేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఓ ఎలక్ట్రిక్ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన నలుగురు ప్రయాణికులు వెంటనే కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదం కోకాపేట్ నుంచి పటాన్‌చెరువు వైపు కారు వెళ్తుండగా జరిగినట్లు తెలుస్తోంది.


లారీని ఢీకొట్టిన వెంటనే కారులో మంటలు చెలరేగడంతో చూస్తుండగానే వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. కారు నుంచి దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. అదృష్టవశాత్తూ నలుగురు ప్రయాణికులు సకాలంలో బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. కాగా, ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో కోకాపేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

కొత్తగా 11,275 మందికి చేయూత పింఛన్లు

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి కూరగాయల ధరల వివరాలు

Updated Date - Nov 20 , 2026 | 09:09 AM