Share News

కొత్తగా 11,275 మందికి చేయూత పింఛన్లు

ABN , Publish Date - Nov 20 , 2026 | 06:22 AM

చేయూత పింఛన్‌ పథకం కింద కొత్తగా మరో 11,275 మందికి పింఛన్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్తగా 11,275 మందికి చేయూత పింఛన్లు
Cheyutha Pension Scheme 2026

  • ఫైలేరియా, ఎయిడ్స్‌, డయాలసిస్‌ బాధితులకు మంజూరు

హైదరాబాద్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): చేయూత పింఛన్‌ పథకం కింద కొత్తగా మరో 11,275 మందికి పింఛన్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే 4,63,857 మందికి చేయూత పథకం కింద పింఛన్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.


ఫైలేరియా, ఎయిడ్స్‌, డయాలసిస్‌ బాధితులకు కొత్తగా చేయూత పింఛన్ల మంజూరుకు సంబంధించిన ఫైలుపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థిశాఖ మంత్రి సీతక్క గురువారం సంతకం చేశారు. తాజాగా మంజూరైన వాటిలో ఫైలేరియా బాధితులకు 5,895, ఎయిడ్స్‌ బాధితులకు 3,024, డయాలసిస్‌ రోగులకు 2,356 పింఛన్లు ఇవ్వనున్నారు. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లబ్థిదారుల ఖాతాల్లో పింఛన్‌ సొమ్ము జమ చేయనున్నట్లు సంబంధిత విభాగాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 06:22 AM