బంగారం, వెండి ధరల భారీ పతనం..
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:16 AM
బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. వరుసగా మూడో రోజు కూడా భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. వరుసగా మూడో రోజు కూడా భారీగా తగ్గాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో విలువైన లోహాల ధరలు పడిపోతున్నాయి. ఈ రోజు (శుక్రవారం) దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.5120 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.4700 మేర ధర తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గింది. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించినట్లయింది (Gold Silver Price Live).
గుడ్‌రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5120 తగ్గి రూ.1,25,570కు చేరింది (Gold Rate Today). అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.4700 తగ్గి రూ.1,15,100 వద్దకు దిగివచ్చింది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.1.75 లక్షలకు చేరింది.
తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,180 |
వరంగల్ | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,180 |
నిజామాబాద్ | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,180 |
ఖమ్మం | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,180 |
ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,180 |
విశాఖపట్నం | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,180 |
అమరావతి | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,180 |
కాకినాడ | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,180 |
తిరుపతి | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,180 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,200 |
ముంబై | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,180 |
ఢిల్లీ | ₹1,25,720 | ₹1,15,250 | ₹94,330 |
కోల్‌కతా | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,180 |
కేరళం | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,180 |
పుణె | ₹1,25,570 | ₹1,15,100 | ₹94,180 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
గతంలో ఇరాక్‌పై కూడా ఇలాంటి ప్రచారమే చేశారు: ఇరాన్
బంగ్లాదేశ్‌లో హింస.. భారత్‌పైనా ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆరోపణలు..