గతంలో ఇరాక్‌పై కూడా ఇలాంటి ప్రచారమే చేశారు: ఇరాన్
ABN , Publish Date - Nov 20 , 2026 | 08:52 AM
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. ఇరాన్ జీవ, రసాయన ఆయుధాలను తయారు చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. ఇరాన్ జీవ, రసాయన ఆయుధాలను తయారు చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా గతంలో ఇరాక్‌పై చేసిన ఆరోపణలను గుర్తుచేస్తూ ఘాటుగా స్పందించింది (Iran Biological Weapons).
ఇరాన్ అణ్వాయుధాలను పొందకుండా అమెరికా అడ్డుకుందని, దీంతో ఇప్పుడు ఆ దేశం జీవ, రసాయన ఆయుధాల తయారీపై దృష్టి పెట్టే అవకాశముందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ అమెరికాపై ఇరాన్ దాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ట్రంప్ ఆరోపణలపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పందించారు. 2003లో ఇరాక్‌పై దాడికి ముందు సామూహిక విధ్వంసక ఆయుధాల పేరుతో చేసిన ప్రచారాన్నే అమెరికా ఇప్పుడు మళ్లీ తెరపైకి తెస్తోందని పేర్కొన్నారు (Iran Chemical Weapons).
గతంలో ఇరాక్‌పై కూడా అమెరికా ఇలాంటి ఆరోపణలే చేసిందని గుర్తుచేశారు (US Iran Conflict). 2003లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి కోలిన్ పావెల్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రసంగిస్తూ ఇరాక్ వద్ద సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయంటూ చిన్న సీసాను ప్రదర్శించిన విషయాన్ని బఘాయీ ప్రస్తావించారు. అసత్య ప్రచారాలు చేసి ఇరాక్‌పై సైనిక దాడికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు అమెరికా ప్రయత్నించిందని అన్నారు. ఇప్పుడు ఇరాన్‌పై కూడా అదే తరహా ప్రచారానికి తెర తీశారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
అదరగొట్టిన ఆంథ్రోపిక్.. 2 ట్రిలియన్ డాలర్లకు చేరిన కంపెనీ విలువ..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..