Share News

అదరగొట్టిన ఆంథ్రోపిక్.. 2 ట్రిలియన్ డాలర్లకు చేరిన కంపెనీ విలువ..

ABN , Publish Date - Nov 20 , 2026 | 07:35 AM

ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) అమెరికా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన తొలిరోజే అదరగొట్టింది. నాస్‌డాక్ (Nasdaq) స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయిన వెంటనే కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి.

అదరగొట్టిన ఆంథ్రోపిక్.. 2 ట్రిలియన్ డాలర్లకు చేరిన కంపెనీ విలువ..
Anthropic IPO

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) అమెరికా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన తొలిరోజే అదరగొట్టింది. నాస్‌డాక్ (Nasdaq) స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయిన వెంటనే కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో ఏకంగా 34 శాతానికి పైగా లాభపడ్డాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ కొద్దిసేపటికే 2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఏఐ రంగంలో పెట్టుబడిదారులకు ఉన్న ఆసక్తికి ఈ పరిణామం అద్దం పడుతోంది (Anthropic IPO).


ఆంథ్రోపిక్ తన ఐపీఓ (IPO)లో ఒక్కో షేరు ధరను 83 డాలర్లుగా నిర్ణయించింది. అయితే నాస్‌డాక్‌లో ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు ఒక్కో షేరు 111.50 డాలర్ల వద్ద నమోదైంది. అంటే ఐపీఓ ధరతో పోలిస్తే 34 శాతానికి పైగా పెరిగింది. అంతకుముందు కంపెనీ ఒక్కో షేరును 70 నుంచి 78 డాలర్ల మధ్య విక్రయించాలని భావించినప్పటికీ, భారీ డిమాండ్ కారణంగా చివరకు 83 డాలర్లుగా నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఆంథ్రోపిక్ సుమారు 98 కోట్ల షేర్లను విక్రయించింది. ఒక్కో షేరును 83 డాలర్ల చొప్పున విక్రయించడం ద్వారా సుమారు 81 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది (Anthropic Stock Price).


ఈ భారీ ఐపీఓతో గతంలో స్పేస్‌ఎక్స్ నెలకొల్పిన రికార్డును ఆంథ్రోపిక్ అధిగమించింది (Anthropic Valuation). ఆంథ్రోపిక్ సంస్థను 2021లో ఓపెన్‌ఏఐ నుంచి బయటకు వచ్చిన కొందరు పరిశోధకులు స్థాపించారు. డారియో అమోడెయ్, డేనియెలా అమోడెయ్ ఈ సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన క్లాడ్ (Claude) ఏఐ అసిస్టెంట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, పరిశోధన, వ్యాపార కార్యకలాపాల్లో క్లాడ్ వినియోగం పెరుగుతోంది.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్

Updated Date - Nov 20 , 2026 | 07:35 AM