హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం
ABN , Publish Date - Nov 19 , 2026 | 10:59 AM
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాకుండా నిఘా ఆపరేషన్లు నిర్వహిస్తూ డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ఫ్యూచర్ సిటీ పోలీసుల భారీ ఆపరేషన్ చేపట్టారు.
హైదరాబాద్, నవంబర్ 19: డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాకుండా నిఘా ఆపరేషన్లు నిర్వహిస్తూ డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ఫ్యూచర్ సిటీ పోలీసుల భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారిన డ్రగ్స్ కింగ్‌పిన్ పట్టుబడ్డాడు. ఇబ్రహీంపట్నంలో కేరళంకు చెందిన ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు.
మహేశ్వరం ఎస్‌ఓటీ, ఇబ్రహీంపట్నం పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేపట్టగా.. మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్‌పిన్ అబ్దుల్ మిషాల్‌తో పాటు మరో నిందితుడు తారిఖ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మిషాల్ బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎమ్‌డీఎమ్‌ఏ తయారీతో పాటు కొనుగోలు చేసి విక్రయాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల యువతే టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుపాను.. 24 నుంచి 36 గంటలు అప్రమత్తం
సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్
Read latest Telangana News And Telugu NEws