Share News

బలపడిన అక్వాన్.. 12 కి.మీ వేగంతో కదులుతున్న తుపాను

ABN , Publish Date - Nov 19 , 2026 | 08:57 AM

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపారు.

బలపడిన అక్వాన్.. 12 కి.మీ వేగంతో కదులుతున్న తుపాను
Aquan Cyclone Update

అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపారు. ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 440కిలోమీటర్లు, కళింగపట్నంకి 440 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్లు,గోపాల్‌పూర్‌కి 530 కిలోమీటర్లు, పూరీకు 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పుకొచ్చారు.


ఇది రేపు (శుక్రవారం) మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ ప్రాంతాల మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు (గురువారం), రేపు (శుక్రవారం) ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తీరం వెంబడి గంటకు 60 నుంచి70 కిలోమీటర్లు, గరిష్ఠంగా 80కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రఖర్ జైన్ సూచించారు.

Updated Date - Nov 19 , 2026 | 09:32 AM