సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్ అసంతృప్తి
ABN , Publish Date - Nov 19 , 2026 | 08:02 AM
వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. అయితే టీమిండియా ప్రకటించిన తుది జట్టుపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. అయితే టీమిండియా ప్రకటించిన తుది జట్టుపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టడాన్ని ఆయన ప్రశ్నించాడు. సిరాజ్ ఎప్పుడూ భారత్‌ను నిరాశపరచలేదని.. అలాంటి ప్లేయర్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యంగా అనిపించిందని తెలిపాడు. కాగా సిరాజ్‌తో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా తొలి టెస్టులో చోటు దక్కలేదు.
‘సిరాజ్ టెస్టు జట్టులో ముందుగానే చేరకపోయినప్పుడే కొన్ని సంకేతాలు కనిపించాయి. కివీస్‌పై చివరి వన్డేలో ఆడినప్పుడు అతడికి అవకాశం ఇస్తారని అనుకున్నాను. కానీ ఇప్పుడు తుది జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అతడు భారత్‌ను ఎప్పుడూ నిరాశపరచలేదు. అతడి బౌలింగ్‌లోనూ ఏదీ తప్పుగా కనిపించడం లేదు. ఇటీవల ఆడిన మ్యాచ్‌ల్లోనూ బాగానే బౌలింగ్ చేశాడు. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నాకు తెలియదు. అతడి స్థానంలో ఎంపికైన ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నాను’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి:
వెల్ ప్లెయిడ్ ఎంఎస్.. ధోనీ ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై సచిన్ స్పెషల్ పోస్ట్!
తొలి టెస్టు: చెలరేగుతున్న భారత బౌలర్లు.. కివీస్ స్కోర్ 66/4