Share News

తొలి టెస్టు: చెలరేగుతున్న భారత బౌలర్లు.. కివీస్ స్కోర్ 66/4

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:32 AM

వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తొలి టెస్టులో తలపడుతున్నాయి. లంచ్ బ్రేక్ ముగిసిన తర్వాత 27 ఓవర్లకు కివీస్ 4 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది.

తొలి టెస్టు: చెలరేగుతున్న భారత బౌలర్లు.. కివీస్ స్కోర్ 66/4
India vs New Zealand 1st Test

స్పోర్ట్స్ డెస్క్: వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తొలి టెస్టులో తలపడుతున్నాయి. లంచ్ బ్రేక్ ముగిసిన తర్వాత 27 ఓవర్లకు కివీస్ 4 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. కెప్టెన్ టామ్ లాథమ్(0), డెవాన్ కాన్వే(4), రచిన్ రవీంద్ర(15), డారిల్ మిచెల్(1) స్వల్ప పరుగులకే ఔటయ్యారు.


క్రీజులో హెన్రీ నికోల్స్(35*), టామ్ బ్లండెల్(5*) కొనసాగుతున్నారు. భారత బౌలర్లలో బుమ్రా 2, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్‌లు తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?

రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!

Updated Date - Nov 19 , 2026 | 06:35 AM