బెర్త్ పట్టేశాడు
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:29 AM
భారత ఏస్ షట్లర్ లక్ష్య సేన్.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. తనకు గట్టిపోటీదారుగా ఉన్న కోకి వటనెబె (జపాన్)ను...
వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు లక్ష్య సేన్
కలిసొచ్చిన శ్రీకాంత్ విజయం
కౌలూన్ (హాంకాంగ్): భారత ఏస్ షట్లర్ లక్ష్య సేన్.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. తనకు గట్టిపోటీదారుగా ఉన్న కోకి వటనెబె (జపాన్)ను కిడాంబి శ్రీకాంత్ ఓడించడంతో.. సేన్‌కు లైన్ క్లియర్ అయింది. కాగా, బుధవారం జరిగిన హాంకాంగ్ ఓపెన్ తొలి రౌండ్‌లో లక్ష్య సేన్ 14-21, 21-16, 25-23తో అర్నాడ్ మెర్కెల్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-16, 16-21, 21-9తో వటనెబెను ఓడించాడు. వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు హాంకాంగ్ ఓపెన్ చివరి క్వాలిఫయింగ్ టోర్నీ కావడంతో.. పాయింట్లలో లక్ష్య సేన్‌ను వటనెబె అధిగమించే అవకాశాలు లేవు. మహిళల సింగిల్స్‌లో రక్షిత రామ్‌రాజ్ 21-18, 21-18తో మియా బ్లిట్‌ఫాల్డ్ (డెన్మార్క్)పై, అస్మిత చలీహా 12-21, 21-13, 21-12తో ఇషారాణి బారువాపై గెలిచి ముందంజ వేశారు. అయితే ఉన్నతి హుడా, అన్మోల్ కర్బ్ ఓటములతో ఇంటిముఖం పట్టారు. డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జంట 21-16, 21-9తో హాంకాంగ్‌కు చెందిన ఫాన్ క యాన్-లీయింగ్ యుయెట్‌పై గెలిచారు. మిక్స్‌డ్‌లో హరిహరన్-తనీషా క్రాస్టో జంట, ధ్రువ్ కపిల-రాధిక శర్మ పరాజయం పాలయ్యారు.
ఇవి కూడా చదవండి:
20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?
రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!