Share News

రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:09 PM

కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యంలో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా భర్త జయ్ మెహతా తన సగం వాటాను విక్రయించినట్లు సమాచారం.

రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!
Kolkata Knight Riders

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యంలో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా భర్త జయ్ మెహతా తన సగం వాటాను విక్రయించినట్లు సమాచారం. అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల సంస్థ ఆరెస్ మేనేజ్‌మెంట్‌తో ఆయన డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం కేకేఆర్‌లో జయ్ మెహతాకు 45 శాతం వాటా ఉంది. ఇందులో 22.5 శాతం వాటాను సుమారు 400 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3,700 కోట్లకు పైగా) విక్రయించినట్లు సమాచారం. ఈ డీల్ నగదు రూపంలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే వాటా విక్రయానికి బీసీసీఐ అధికారిక అనుమతి తప్పనిసరి. కాగా కేకేఆర్ మొత్తం విలువ రూ.16,634 కోట్లుగా ఇటీవలే ఓ సంస్థ నిర్ణయించింది.


2007లో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, జయ్ మెహతా, జూహీ చావ్లా కలిసి ప్రమోటర్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. ఐపీఎల్ తొలి సీజన్‌కు ముందు కేకేఆర్‌ను దక్కించుకున్నారు. అమెరికాలో స్పోర్ట్స్ క్లబ్‌లను కలిగిన అరెస్ మేనేజ్‌మెంట్‌తో ఇప్పుడు జయ్ మెహతా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డీల్ చివరి స్టేజ్‌లో ఉన్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ డీల్‌తో బీసీసీఐకు కూడా భారీగానే ఆదాయం రానుంది.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ఏకంగా 12 స్థానాలు ఎగబాకిన అర్ష్‌దీప్ సింగ్

సీఎస్కే ప్లేయర్ అవమానించినా.. ధోనీ భరించాడు: ఆకాశ్ చోప్రా

Updated Date - Nov 18 , 2026 | 05:09 PM