Share News

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ఏకంగా 12 స్థానాలు ఎగబాకిన అర్ష్‌దీప్ సింగ్

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:30 PM

ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ప్రకటించింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తాజా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ఏకంగా 12 స్థానాలు ఎగబాకిన అర్ష్‌దీప్ సింగ్
Arshdeep Singh

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ప్రకటించింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తాజా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. బౌలర్ల జాబితాలో ఏకంగా 12 స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 19వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అత్యధికంగా పురోగతి సాధించన ఆటగాళ్లలో అర్ష్‌దీప్ ఒకడిగా నిలిచాడు. కాగా అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. మరోవైపు భారత్‌పై నాలుగో వన్డేలో ఆరు వికెట్లతో చెలరేగిన న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ 15 స్థానాలు మెరుగుపరుచుకుని సంయుక్తంగా 12వ ర్యాంక్‌కు చేరాడు. అదే జట్టుకు చెందిన కైల్ జేమీసన్ కూడా 15 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌లో నిలిచాడు.


బ్యాటింగ్ విభాగంలో..

వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(806 పాయింట్లతో) అగ్రస్థానాన్ని పదిలపరుచుకున్నాడు. రెండో స్థానంలో మిచెల్(778 పాయింట్లు), మూడో స్థానంలో విరాట్ కోహ్లీ(757 పాయింట్లు)తో కొనసాగుతున్నారు. కాగా ఇంగ్లండ్ బ్యాటర్ టామ్ బాంటన్ తాజా ర్యాంకింగ్స్‌లో భారీగా పురోగతి సాధించాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో బాంటన్ అద్భుత సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 34 స్థానాలు ఎగబాకి కెరీర్‌లోనే అత్యుత్తమంగా 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇంగ్లండ్ మరో స్టార్ బ్యాటర్ జో రూట్ కూడా టాప్-10లోకి తిరిగి వచ్చాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించిన అతడు రెండు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు.


టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆటగాళ్ల హవా

టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 6 స్థానాల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అగ్రస్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (861 పాయింట్లు) కొనసాగుతున్నాడు. కాగా భారత స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్(713 పాయింట్లు) ఏడో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు జింబాబ్వే, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పలువురు ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని సంయుక్తంగా 16వ స్థానానికి చేరాడు. జింబాబ్వే స్పిన్నర్ గ్రేమ్ క్రీమర్ కూడా ఆరు స్థానాలు ఎగబాకి 65వ ర్యాంక్‌కు చేరాడు.


ఇవి కూడా చదవండి:

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

అమితాబ్, అభిషేక్ బచ్చన్‌ల హత్యకు 200 మంది సిద్ధం.. గోల్డీ ధిల్లాన్ మరోసారి బెదిరింపులు..

Updated Date - Nov 18 , 2026 | 03:30 PM