Share News

ఐపీఎల్ 2027 వేలం తేదీ, వేదిక ఖరారు.. బీసీసీఐ అధికారిక ప్రకటన

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:04 PM

ఐపీఎల్‌ 2027కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. మినీ వేలం తేదీ, సమయం, వేదికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఈ వివరాలతో ప్రకటన విడుదల చేసింది.

ఐపీఎల్ 2027 వేలం తేదీ, వేదిక ఖరారు.. బీసీసీఐ అధికారిక ప్రకటన
IPL 2027

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2027కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. మినీ వేలం తేదీ, సమయం, వేదికను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ఇవాళ(బుధవారం) ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఈ వివరాలతో ప్రకటన విడుదల చేసింది. దీంతో వేలం తేదీ, వేదికపై గతకొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.


బీసీసీఐ అధికారిక ప్రకటన ప్రకారం.. డిసెంబర్‌ 16న ఐపీఎల్‌ 2027 మినీ వేలం జరగనుంది. గోవా వేదికగా ఈ వేలం జరగనుంది. ఈ మినీ వేలం మూడేళ్ల తర్వాత తిరిగి భారత్‌లో జరగనుండటం విశేషం. గత మూడు సీజన్ల వేలం దుబాయ్, జెడ్డా, అబుదాబి నగరాల్లో జరిగాయి. చివరిసారి 2023లో భారత్ లో ఈ వేలం జరిగింది. ప్రస్తుత సైకిల్‌లో జరగబోయే చివరి మినీ వేలం ఇదే కావడం గమనార్హం. ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. సాధారణంగా ఐపీఎల్‌ అక్షన్లు మధ్యాహ్నం ప్రారంభమవుతుంటాయి. అయితే ఈసారి సమయాన్ని ముందుకు మార్చడం వెనుక ప్రసారకర్తల వ్యూహం ఉన్నట్లు సమాచారం.

Updated Date - Nov 18 , 2026 | 01:21 PM