బాల్ ట్యాంపరింగ్ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:49 AM
ఆస్ట్రేలియా క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ఠపాలు చేసిన 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఆ ఘటనకు సంబంధించి అప్పట్లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఆటగాళ్లు, సిబ్బందిని మరోసారి విచారించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నిర్ణయించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ఠపాలు చేసిన 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఆ ఘటనకు సంబంధించి అప్పట్లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఆటగాళ్లు, సిబ్బందిని మరోసారి విచారించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నిర్ణయించింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ 'సబర్'లో ఈ ట్యాంపరింగ్ గురించి ప్రస్తావించాడు. వాటిని ఆస్ట్రేలియా వార్తాపత్రికలు ప్రచురించడంతో ఎనిమిదేళ్ల నాటి ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది.
ఖవాజా చేసిన ఆరోపణలు, అప్పటి బాల్ ట్యాంపరింగ్ వివాదానికి తాజాగా ముగింపు పలికేందుకు ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ డేవిడ్ బూన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్ బర్గ్ వెల్లడించారు. అత్యంత గోప్యంగా విచారణ జరుగుతుందని, రహస్య వాతావరణంలో సాక్ష్యుల నుంచి సమాచారం సేకరించనున్నారు.అప్పట్లో సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది ఎవరైనా సరే.. మరోసారి తమ వాదనను వినిపించవచ్చని తెలిపారు. అయితే, ఇది ఎలాంటి పునర్విచారణ కాదని, ఎవరికీ కొత్త శిక్షలు విధించబోమని గ్రీన్ బర్గ్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ సుమారు నెల రోజుల్లో పూర్తవుతుందని, పారదర్శకత పాటిస్తామని స్పష్టం చేశారు.
2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ ఉదంతం కారణంగా గతంలోనే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ కఠిన శిక్షలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో జట్టులో ఉన్న ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహా పలువురు ఈ వివాదం గురించి ప్రస్తావించారు. నాటి బాల్ ట్యాంపరింగ్ వివాదంపై పూర్తి స్పష్టత తెచ్చి, క్రికెట్ బోర్డులో అంతర్గత గాయాలను మాన్పడమే లక్ష్యంగా ఈ తాజా చర్యలు చేపట్టినట్లు క్రికెట్ ఆస్ట్రేలియ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
ఇన్సూరెన్స్ తప్పనిసరి.. వాహనదారులకు మంత్రి మండిపల్లి కీలక సూచనలు
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. గ్రామాల ప్రజలకు అటవీ శాఖ హెచ్చరికలు