Share News

హ్యాట్రిక్‌పై భారత్‌ గురి

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:25 AM

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం..ప్రపంచ కప్‌లో ఐదో స్థానం.. వెరసి ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత మహిళలు ఆసి యా చాంపియన్స్‌ ట్రోఫీ (ఏసీటీ) హాకీ టోర్నీకి..

హ్యాట్రిక్‌పై భారత్‌ గురి

  • నేటి నుంచి మహిళల ఏసీటీ హాకీ

  • తొలి మ్యాచ్‌లో మలేసియాతో ఢీ

భోపాల్‌: ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం..ప్రపంచ కప్‌లో ఐదో స్థానం.. వెరసి ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత మహిళలు ఆసి యా చాంపియన్స్‌ ట్రోఫీ (ఏసీటీ) హాకీ టోర్నీకి సై అంటున్నారు. గురువారం ఇక్కడ ప్రారంభమయ్యే టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ వరుసగా మూడోసారి టైటిల్‌ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. రాంచీ, రాజ్‌గిర్‌లో జరిగిన గత రెండు చాంపియన్స్‌ ట్రోఫీల్లోనూ మనోళ్లే టైటిళ్లు అందుకోవడం విశేషం. ఇక.. సలీమా టేటే సారథ్యంలోని భారత్‌ తొలిరోజు మలేసియాతో తలపడనుంది. భారత్‌, మలేసియాతోపాటు దక్షిణకొరియా, చైనా, థాయ్‌లాండ్‌, జపాన్‌ జట్లు తలపడుతున్నాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ విధానంలో జరిగే టోర్నీలో బలమైన చైనా, జపాన్‌, దక్షిణ కొరియా నుంచి మనోళ్లకు గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశముంది. లీగ్‌ దశలో తొలి నాలుగు స్థానాలలో నిలిచే జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈనెల 28న ఫైనల్‌ జరుగుతుంది. మొదటి రోజు జరిగే ఇతర మ్యాచుల్లో చైనా-థాయ్‌లాండ్‌, జపాన్‌-దక్షిణకొరియా ఢీకొంటాయి.

సా. 4.45 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

టీమిండియా షెడ్యూల్‌

నవంబరు 19: మలేసియాతో

నవంబరు 21: ద.కొరియాతో

నవంబరు 22: థాయ్‌లాండ్‌తో

నవంబరు 24: చైనాతో

నవంబరు 25: జపాన్‌తో

ఇవి కూడా చదవండి:

20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?

రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!

Updated Date - Nov 19 , 2026 | 04:25 AM