వెల్ ప్లెయిడ్ ఎంఎస్.. ధోనీ ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై సచిన్ స్పెషల్ పోస్ట్!
ABN , Publish Date - Nov 19 , 2026 | 07:10 AM
భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు ప్లేయర్‌గా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ధోనీ క్రికెట్ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు ప్లేయర్‌గా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇక నుంచి సీఎస్కే జట్టు మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ధోనీ క్రికెట్ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టాడు. ధోనీతో తనకున్న అనుబంధాన్ని గురించి వెల్లడించాడు.
‘కెరీర్ తొలినాళ్లలో బంగ్లాదేశ్‌లో ధోనీ బ్యాటింగ్‌ను చూసిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది. అతడి బ్యాటింగ్‌లో ఏదో ప్రత్యేకత ఉందని, ముఖ్యంగా బంతిని బలంగా బాదే సామర్థ్యం అసాధారణమని సౌరభ్ గంగూలీతో చెప్పాను. అతడిలో అరుదైన ప్రతిభ ఉందని అప్పుడే అర్థమైంది. ఆ తర్వాత అతడు సాగించిన ప్రయాణం అద్భుతం. ఎంఎస్.. నీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, భారత క్రికెట్‌లో ఎన్నో మధుర క్షణాల్లో భాగస్వామిని కావడం నిజంగా ఆనందంగా ఉంది. నువ్వు ఏదో గొప్ప ఘనత సాధిస్తావని అప్పుడే నమ్మాను. అయితే నా అంచనాలకు మించి విజయాలు సాధించావు. భారత క్రికెట్‌కు నీ వంతు అత్యుత్తమ సేవలు అందించావు. నీతో కలిసి ఈ ప్రయాణంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. వెల్ ప్లేయిడ్ ఎంఎస్!’ అంటూ సచిన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?
రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!