Share News

బంగ్లాదేశ్‌లో హింస.. భారత్‌పైనా ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆరోపణలు..

ABN , Publish Date - Nov 20 , 2026 | 09:40 AM

బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

బంగ్లాదేశ్‌లో హింస.. భారత్‌పైనా ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆరోపణలు..
Tarique Rahman

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బస్సులు, వాహనాలకు నిప్పుపెట్టడం, బాంబు పేలుళ్లు, రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు వంటి ఘటనలు జరిగాయి. ఈ పరిణామాలపై ప్రస్తుత ప్రధాని తారిఖ్ రెహ్మాన్ తీవ్రంగా స్పందించారు (Bangladesh Violence).


దేశంలో అశాంతిని సృష్టించేందుకు అవామీ లీగ్ ప్రయత్నిస్తోందని తారిఖ్ ఆరోపించారు. ప్రజలంతా ఐక్యంగా నిలబడి ఇలాంటి శక్తులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లోని లాల్మోనిర్‌హాట్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో తారిఖ్ రెహ్మాన్ మాట్లాడారు. దేశ ప్రజలు మళ్లీ హత్యలు, కిడ్నాప్‌లు, దహనకాండలు, ఉగ్రవాదంతో కూడిన రాజకీయాలను కోరుకోవడం లేదన్నారు. ప్రజల ఓటు హక్కును హరించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తున్న శక్తులకు ప్రజలంతా ఐక్యంగా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు (Bangladesh Political Crisis).


ఈ సందర్భంగా తారిఖ్ భారత్‌ను కూడా పరోక్షంగా ప్రస్తావించారు (India Bangladesh Relations). దేశ సరిహద్దు అవతల ఆశ్రయం పొందిన అవామీ లీగ్ నేతలు తమ విదేశీ యజమానులను సంతోషపెట్టేందుకు బంగ్లాదేశ్‌పై కుట్రలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తారిఖ్ ఏ దేశం పేరునూ నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, భారత్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా 2024 ఆగస్టు 5న బంగ్లాను వీడి వచ్చి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. హసీనాను తిరిగి అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరుతోంది.


ఇవి కూడా చదవండి..

గతంలో ఇరాక్‌పై కూడా ఇలాంటి ప్రచారమే చేశారు: ఇరాన్


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 20 , 2026 | 09:44 AM