హైదరాబాద్ బస్సుల రూట్లలో మార్పు
ABN , Publish Date - May 23 , 2026 | 01:54 PM
హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు కొనసాగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా హనుమకొండ-హైదరాబాద్ (ఎంజీబీఎస్) మధ్య నడిచే బస్సుల మార్గాలను తాత్కాలికంగా మార్చినట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ తెలిపారు.
ఉప్పల్ కారిడార్ పనుల నేపథ్యంలో ఆర్టీసీ చర్య
హనుమకొండ: హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు కొనసాగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా హనుమకొండ-హైదరాబాద్ (ఎంజీబీఎస్) మధ్య నడిచే బస్సుల మార్గాలను తాత్కాలికంగా మార్చినట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు ఘట్‌కేసర్, చెంగిచర్ల, భగాయత్, నాగోల్, ఉప్పల్ క్రాస్‌రోడ్డు రామంతాపూర్ మీదుగా ఎంజీబీఎస్‌కు చేరుకుంటాయని పేర్కొన్నారు. అదే విధంగా హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి హనుమకొండకు తిరుగు ప్రయాణంలో బస్సులు 6వ నంబర్, ఉప్పల్ క్రాస్‌రోడ్డు, ఫిస్తాహౌస్, చిల్కా నగర్, నల్ల చెరువు మార్గంలో నడుస్తాయని పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులు హనుమకొండ నుంచి ఉప్పల్ నల్ల చెరువు వరకు మాత్రమే నడుపనున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల కారణంగా అమలులోకి వచ్చిన ఈ తాత్కాలిక మార్పులను ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తెలుగుదేశానికో సమన్వయకర్త కావాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News