ఖాకీవనంలో కలుపుమొక్కలు..
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:18 PM
ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన పోలీస్‌స్టేషన్లు- కొన్నిచోట్ల మామూళ్లకు కేంద్రాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పోలీసు శాఖలో పెరుగుతున్న మామూళ్ల దందా
నెక్కొండ తరహా పోలీస్ స్టేషన్‌లు ఎన్నో..
100కు డయల్ చేసినా బాధితులకు దక్కని న్యాయం
ఎఫ్‌ఐఆర్ నుంచి బెయిల్ వరకు ముడుపుల మంత్రం
పోలీస్‌స్టేషన్ గడప దాటాలంటే జేబు ఖాళీ కావాల్సిందే..
ఏసీబీ దాడులు, అంతర్గత విచారణలతో వెలుగులోకి ఖాకీల అక్రమాలు
ఖద్దర్ చొక్కాలకు ఖాకీల జీ హుజూర్..అక్రమార్కులపై కొరవడిన పర్యవేక్షణ
ఏసీబీ కేసుల్లో చిక్కుకున్నా మారని తీరు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్)
ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన పోలీస్‌స్టేషన్లు- కొన్నిచోట్ల మామూళ్లకు కేంద్రాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టిం గ్‌లు ఇప్పిస్తున్న ఖద్దర్‌నాయక్‌లకు ఖాకీలు జీ హుజూర్.. అంటున్నారనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఫిర్యాదు నమోదు చేసే ఎఫ్‌ఐఆర్ నుంచి దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు, బెయిల్ ప్ర క్రియ వరకు ప్రతీ దశలోనూ డబ్బులు, పొలిటి కల్ ఒత్తిళ్లు ప్రభావం చూపిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 100కు డయల్ చేసినా బాధితులపైనే కేసు నమోదుకు నెక్కొండ ఎస్‌ఐ ప్రయత్నించిన ఘటన ఈ తరహా ఆరోపణలను మరోసారి తెరపైకి తెచ్చాయి. ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తున్నా.. ఏసీబీకి పట్టుబడుతున్నా.. ఖాకీల తీరు మారటం లేదనే దానికి ఉదాహరణగా నెక్కొండ ఎస్‌ఐ మహేందర్ సస్పెండ్ ఉదంతం నిదర్శనంగా మారింది.
చేయి తడిపితేనే..
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుకు వెళితే జేబులు ఖాళీ కావాల్సిందే. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీస్‌స్టేషన్‌లల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి చార్జిషీట్ దాఖలు, స్టేషన్ బెయిల్ వరకు ప్రతీదానికి వసూళ్లే అనే ఆరోపణలు ఉన్నాయి. భూ వివాదాలు, భార్యా భర్తల పంచాయితీలు, అద్దె ఇళ్ల వివాదాలు, మద్యం గొడవలను కొందరు పోలీసులు కాసుల కురిపించే ఏటీఏంలుగా మార్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. స్టేషన్ బెయిల్ ఇవ్వాలన్నా.. కేసులో తీవ్రత తగ్గించాలన్నా.. లక్షల్లో కొందరు ఎస్‌హెచ్‌వోలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమకు నమ్మకమైన కానిస్టేబుళ్లు, రైటర్లు, హోంగార్డులు.. లేదంటే బయట వ్యక్తులను మధ్యవర్తులుగా పెట్టుకుని స్టేషన్‌కు వచ్చే బాధితులను బాదుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులు ఇచ్చే ఫిర్యాదు నమోదు చేయాలన్నా కొంద రు ఖాకీలు వేలల్లో డిమాండ్ చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఠాణాల్లో తందానే..
‘శాంతిభద్రతల పరిరక్షణ.. ప్రజల ప్రాణ, ఆస్తులకు రక్ష ణ’.. ఇది పోలీసు శాఖ నినాదం. ఇటీవల పోలీస్ కమిషన రేట్ పరిధిలో పలు సంఘటనలు డబ్బులు ఇస్తేనే రక్షణ.. ఖద్దర్ పైరవీ ఉంటేనే భరోసా అన్నట్లుగా మారుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుసగా వివిధ పోలీస్ స్టేషన్‌లలో ఏసీపీ, సీఐ, ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, కాని స్టేబుల్స్ పలు అవినీతి, మహిళలపై లైంగిక వేధింపులు తదితర ఆరోపణలతో సస్పెండ్ అవుతుండటం ప్రజల్లో ఖాకీ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఠాణాల్లోకి వచ్చే బాధితులు లక్ష్యంగా కొందరు పో లీసులు చేస్తున్న వికృత చేష్టలు, మామూళ్ల దందా ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖాకీల పై వస్తున్న అవినీతి ఆరోపణలపై అంతర్గత విచారణలతో అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా సస్పెండ్ అయినా నెక్కొండ ఎస్‌ఐ మహేందర్‌పై కూడా పలు అవినీతి ఆరోపణలున్నాయి. గత నెల 17వ తేదీన నెక్కొండ మండలంలో ఓ గొర్రెల పంచాయితీలో బాధితురాలు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేసింది. అయితే ఎస్సై బాధితురాలినే బెదిరించి, వ్యతిరేకవర్గానికి సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో అంతర్గత విచారణ అనంతరం ఎస్సై అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి ఎస్సైపై సస్పెండ్ వేటు వేశారు.
ఏప్రిల్ 27వ తేదీన మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో మొబైల్ ఫోన్ చోరీ కేసులో స్టేషన్‌కు వచ్చిన బాధితుల వద్ద డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో కానిస్టేబుల్ సుమన్‌ను సస్పెండ్ చేశారు.

జనవరి 8వ తేదీన కేయూ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీకాంత్ ఓ కేసులో సీజ్ చేసిన వాహనానాలు, ఫోన్లను విడుదల చేయడానికి రూ.15వేలు లంచం తీసుకుంటూ ప్రైవేటు డ్రైవర్‌తో సహా ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కి సస్పెండ్ అయ్యారు.
జూన్ 27న ధర్మసాగర్ సీఐ శ్రీధర్ ఓ భూకబ్జాకు సంబంధించి బాధితుడి నుంచి రూ.2లక్షలు డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు రావటంతో అప్పటి సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఏఆర్‌కు అటాచ్డ్ చేశారు.
జూన్ 28వ తేదీన జనగామ జిల్లా నర్మెట్ట సీఐ అబ్బయ్య, ఎస్‌ఐ హమీద్‌లు పట్టుకున్న రేషన్ బియ్యాన్ని రికార్డులో తక్కువ చూపించి, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు.
మార్చి 23వ తేదీన అవినీతి ఆరోపణలతో నర్సంపేట ఎస్‌ఐ రవికుమార్, ఎల్కతుర్తి మాజీ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌లను సస్పెండ్ చేశారు.
ఏప్రిల్ 10వ తేదీన ఆత్మకూరు ఎస్‌ఐ సతీష్‌ను అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేయగా, ఏప్రిల్ 11న అవినీతి ఆరోపణలతో బచ్చన్నపేట ఎస్‌ఐని కమిషనరేట్‌కు అటాచ్డ్ చేశారు.
ఏప్రిల్ 29వ తేదీన ఓ హెడ్‌కానిస్టేబుల్ వడ్డీవ్యాపారం చేస్తూ, డబ్బులు ఇవ్వని వారి ఇళ్లపైకి వెళ్లి దాడులు చేస్తుండటం, చెన్నారావుపేటకు చెందిన మరో హెడ్ కానిస్టేబుల్ మద్యం సేవించి విధుల పట్ల ఆలసత్వం వహిస్తుండటంతో సస్పెండ్ అయ్యారు.
గత ఏడాది మిల్స్‌కాలనీ స్టేషన్‌లో ఓ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న మహిళపై సీఐ లైంగిక వేధింపులకు పాల్పడంతో 2025 మే 20వ తేదీన సస్పెండ్ చేశారు. ఇదే స్టేషన్‌లో పని చేస్తున్న మరో ఎస్‌ఐ తనతో పాటు స్టేషన్‌లో పనిచేస్తున్న సాటి మహిళ పోలీస్ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు దిగటంతో మార్చి 26వ తేదీన అప్పటి సీపీ సన్‌ప్రీత్ సింగ్ సస్సెండ్ చేస్తు ఉత్తర్వ్యులు జారీ చేశారు.
అటు మామూళ్లు.. ఇటు లైంగిక వేధింపులతో పోలీసుల నిజాయితీని శంకించే పరిస్థితిని కొంతమంది ఖాకీలు తీసుకవస్తున్నారనే ఆందోళన పోలీస్‌వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఎంతోమంది నీతి నిజాయితీగా, డ్యూటే ప్రాణంగా పని చేస్తున్నప్పటికీ ఇలాంటి కలుపు మొక్కలతో వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందనే ఆవేదన వ్యక్తం అవుతోంది. ఇలా హద్దులు మీరుతున్న ఖాకీల వెనుక ఖద్దరు అండదండలు దండిగా ఉన్నాయని తెలుస్తోంది. కొందరు నేతలు స్టేషన్‌లకు రేటు కట్టి సిఫార్సు లేఖలు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో గత సీపీ సన్‌ప్రీత్ సింగ్ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను బుట్టదాఖలు చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఖాకీలపై నిఘా కరువైందా..?
వరంగల్ పోలీసులపై వరుసగా అవినీతి, లైంగిక వేధింపులు తదితర ఆరోపణలు కోకొల్లలుగా వస్తు న్నాయి. వీటిపై అంతర్గత విచారణ జరిపి ఉన్నతా ధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అయితే పోలీ సులపై ఎప్పటికప్పుడు డేగకన్నుతో నిఘా ఉంచే విభాగాల పర్యవేక్షణ కొరవడిందా? అనే అనుమా నాలు వ్యక్తం అవుతున్నాయి. స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ), ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాలు పోలీ సులపై ఫిర్యాదులు వచ్చే వరకు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఏసీబీ అధికారుల కు చిక్కేవరకు కూడా ఈ నిఘా బృందాలకు సమా చారం వెళ్లటం లేదనే చర్చ జరుగుతోంది. నిజానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో అడియోతో కూడిన సీసీ టీవీ కెమెరాలు ఉండాలి. ఎస్‌హెచ్‌వోలు, రైటర్ గదితో పాటు ఎస్‌ఐ, సిబ్బంది గది, ఆరుబయట కచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ఉండాలి. కమిషనరేట్ పరిధిలో కొన్ని స్టేషన్‌లలో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటికి తరుచూ సాంకేతిక లోపాలు వస్తుంటాయి. ఆ టైమ్‌లోనే ఇక్కడ బేరసారాలు సాగుతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఇందిరమ్మ ఇళ్ల’తో సర్కారు కొత్త నాటకం!
Read Latest AP News And Telangana News And International News And Telugu News