నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం: కేంద్రం
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:35 AM
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం వెల్లడించింది.
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం వెల్లడించింది. ప్రతిపక్షం చర్చ కోరితే ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనను 'ఘోర పాపం'గా అభివర్ణించారని పేర్కొంది (NEET paper leak).
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చకు అంగీకరించినప్పటికీ, ప్రతిపక్షం ఆందోళన మార్గాన్ని ఎంచుకుందని కేంద్ర వర్గాలు ఆరోపించాయి. సీజేపీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. నీట్ లీక్ ఘటనపై పూర్తి స్థాయి చర్చ నిర్వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది (Rahul Gandhi protest).
కాగా, ఎన్‌డీఏ ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నీట్ ప్రశ్నపత్రం లీక్‌ను 'ఘోర పాపం'గా పేర్కొన్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షను తిరిగి నిర్వహించామని ప్రధాని వివరించినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..
పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..