Share News

అడవి దారుల్లో బొమ్మల కళ

ABN , Publish Date - May 28 , 2026 | 12:11 PM

వన్యప్రాణులు, పక్షులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతలను గుర్తు చేస్తూ.. గూడూరు అటవీశాఖ రేంజ్‌ పరిధిలోని జాతీయ రహదారి, అంతర్గత రహదారులకు ఇరువైపుల అటవీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పిల్లర్లపై వన్యప్రాణులు, పక్షుల చిత్రాలతో ఆందంగా తీర్చిదిద్దారు.

అడవి దారుల్లో బొమ్మల కళ
Gudur Forest

  • ఆకట్టుకుంటున్న వన్యప్రాణులు, పక్షుల చిత్రాలు

  • జాతీయ రహదారికి ఇరువైపుల పిల్లర్స్‌పై పెయింటింగ్స్‌

  • అటవీ సంరక్షణ బాధ్యతను గుర్తు చేస్తున్న సృజనాత్మక

గూడూరు(మహబుబాబాద్): వన్యప్రాణులు, పక్షులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతలను గుర్తు చేస్తూ.. గూడూరు అటవీశాఖ రేంజ్‌ పరిధిలోని జాతీయ రహదారి, అంతర్గత రహదారులకు ఇరువైపుల అటవీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పిల్లర్లపై వన్యప్రాణులు, పక్షుల చిత్రాలతో ఆందంగా తీర్చిదిద్దారు. జీవకళ ఉట్టిపడే రీతిలో చిత్రకారులు గీసిన బొమ్మలు ఆకట్టుకుంటునాయి. పులి, చిరుతపులి, జింక, ఎలుగుబంట్లు, నక్క, కోతి, దుప్పి, కమిలికోడి, మొసలి, అడవిదున్న, అడవి పంది, ముళ్లపంది, కొండగొర్రె, బెట్టు ఉడుత, చుక్కల దుప్పి, కనుజు, కృష్ణజింక, పాలపిట్ట, నెమలి, పావురం, అడవి కోడి, గద్ద, గుడ్లగూబ ఇలా రకరకాల వన్యప్రాణులు పక్షుల చిత్రాలు చూస్తే వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యతను ప్రయాణికులకు గుర్తు చేస్తున్నాయి.


hnk1.jpgవన్యప్రాణులు, పక్షులు

రకరకాల వన్యప్రాణుల్నీ, ఎన్నెన్నో పక్షుల్నీ.. అవి ఉండే వాతావరణంతో సహా ఈ పిల్లర్స్‌పైన కార్వింగ్‌ చేసి చక్కని రంగులు అద్దారు. సహాజ అడవి పరిసరాలే కన్పించేలా.. దట్టమైన అడవిలో హుందాగా నిలబడిన చుక్కల దుప్పి, చెట్ల నడుమ జింకలను వేటాడుతున్న పులి, పచ్చని ఆకులపై వాలిన సీతాకోక చిలుక, తదితర పక్షులు, వన్యప్రాణులు, వివిధ రకాల ప్రకృతి దృశ్యాలను ఎంచుకుని పిల్లర్లపై అందంగా తీర్చిదిద్దారు. ఈ కళను చూసిన వారందరూ చిత్రకారులను ప్రశంసిస్తున్నారు.


hnk1.4.jpgక్రియేటివ్‌గా..

నాలుగు గోడల మధ్య చూపించే పెయింటింగ్‌ కన్నా.. పబ్లిక్‌ స్థలాల్లో గోడలు, పిల్లర్లపై గీసి నేరుగా కన్పిస్తున్న బొమ్మలైతేనే ఎక్కువ మంది చూస్తారు. రహదారులకు ఇరువైపుల వన్యప్రాణులు, పక్షులు, పచ్చని ప్రకృతి ఉట్టిపడేలా బొమ్మలు వేయించారు. అచ్చం అటవీవాతావరణంలో కళ్లకు కట్టినట్లు బొమ్మలు కన్పిస్తున్నాయి. అటవీ, మనుషులు, వన్యప్రాణులు, పక్షులు, అడవిలో కలిసి జీవించామన్న సందేశాన్ని ఇస్తున్నాయి. మొక్కలు, జంతువులు, పక్షులు కూడ మనుషులాగే భావించాలని చెప్పడమే ఈ పెయింటింగ్‌ ముఖ్య ఉద్దేశమని గూడూరు రేంజ్‌ అధికారి సురేష్‌ తెలిపారు. ప్రజలకు ప్రకృతిపై మరింత అవగాహన కల్పించే కెపాసిటి పెయింటింగ్‌తో కూడిన ఆర్ట్‌ ఉంటుందన్నారు.


సీఏపీడీ నిధులతో..

ములుగు జిల్లా మల్లంపల్లి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌ వరకు 365 జాతీయ రహదారిని నిర్మించారు. ఈ జాతీయ రహదారితో పాటు ఇంటర్నల్‌ రోడ్ల ద్వారా మిషన్‌ భగీరథ పైపులైన్‌, టీఫైబర్‌ కేబుల్‌ లైన్‌లు ఉన్నాయి. అటవీ చట్టాల ప్రకారం. నిర్మాణంలో అటవీభూమి కోల్పోవడం దానికి బదులుగా కేటాయించిన సీఏపీడీ ద్వారా కేటాయించిన రూ.60 లక్షల నిధులతో జాతీయ రహదారితో పాటు అంతర్గత రహదారులకు ఇరువైపుల డీమార్కేషన్‌ ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో పిల్లర్స్‌ ఏర్పాటు చేసి వాటిపై చిత్రకారులతో బొమ్మలు వేయించారు.


hnk4.jpgసామాజిక అంశాలు..

చెట్లను నాటుదాం.. పచ్చదనం పెంచుదాం.. ప్లాస్టిక్‌ వద్దు.. ప్రకృతి ముద్దు.. నీటిని ఆదా చేయండి.. ప్రాణాలను కాపాడండి, మన పర్యావరణం-మన బాధ్యత, ప్రకృతిని ప్రేమిద్దాం-ప్లాస్టిక్‌ను వదిలేద్దాం. చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరం- పచ్చటి అడవులు రేపటి తరాలకు వరాలు, మొక్కలు నాటండి-ప్రకృతిని కాపాడండి.. తదితర అంశాలతో కూడిన నీతి సూక్తులను పిల్లర్లపై రాయించారు. ఇవి వాహనదారులను ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింప చేస్తున్నాయి.


వన్యప్రాణులు, పక్షుల సంరక్షణకు కృషి

- బి.సురేష్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, గూడూరు

గూడూరు అభయారణ్యంలో పక్షులు, వన్యప్రాణుల సందడి ఎక్కువగా ఉంటుంది. వాటి సంరక్షణ కోసం అటవీశాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. ఆహార అన్వేషణ కోసం అధ్యయనం చేస్తున్నాం. గడ్డిజాతి మొక్కలను పెంచుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. పక్షులు, వన్యప్రాణుల విడిదికి అవసరమైన వనరులను ఏర్పాటు చేస్తున్నాం. సీఏపీడీ నిధులతో జాతీయ రహదారితో పాటు అంతర్గత రహదారులకు ఇరువైపుల పిల్లర్స్‌ ఏర్పాటు చేసి పక్షులు, వన్యప్రాణుల చిత్రాలను వేయించి ప్రజలు, ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం.


ఈ వార్తలు కూడా చదవండి:

అవలాంజి అటవీ ప్రాంతంలో తెల్ల పులి సంచారం

రైతన్నల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 28 , 2026 | 12:11 PM