లింగంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రూ.133.36 కోట్లతో ఆర్‌ఓబీ
ABN , Publish Date - May 28 , 2026 | 10:18 AM
సైబరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది.
ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ సిటీ: సైబరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నాలుగు లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గుల్మోహర్ జంక్షన్ వైపు నుంచి రెండు లేన్ల అప్ ర్యాంప్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును ఈపీసీ/టర్న్‌కీ పద్ధతిలో అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
దీని ప్రకారం ఈ టెండర్ ప్రక్రియలో ఎల్-1 బిడ్డర్‌గా ఎంపికైన హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రూ.133.36కోట్ల వ్యయంతో పనులను అప్పగించేందుకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఐటీ కారిడార్‌కు వెళ్లే ఉద్యోగులు, ప్రజా రవాణా వాహనాలకు గణనీయమైన ప్రయాణ సమయం ఆదా కానుంది. నగర అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా చేపడుతున్న ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టు సైబరాబాద్ పరిధిలో రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయనుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థిక సాయం
రైతన్నల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం
Read Latest AP News And Telangana News And International News And Telugu News