Share News

అవలాంజి అటవీ ప్రాంతంలో తెల్ల పులి సంచారం

ABN , Publish Date - May 28 , 2026 | 11:01 AM

తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా అవలాంజి అటవీ ప్రాంతంలో తెల్ల పులి సంచరిస్తున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.

అవలాంజి అటవీ ప్రాంతంలో తెల్ల పులి సంచారం
White Tiger

చెన్నై: తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా అవలాంజి అటవీ ప్రాంతంలో తెల్ల పులి సంచరిస్తున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. గత 2018వ సంవత్సరం ఊటీ సమీపంలోని అవలాంజి అటవీ ప్రాంతానికి వెళ్లిన బెంగళూరుకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌, ఆ ప్రాంతంలో రెండు తెల్లపులుల సంచారం గమనించి ఫొటోలు తీసి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. తెల్లపులులను పర్యవేక్షించేలా అటవీ శాఖ, 15 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. ఫొటోగ్రాఫర్‌ తీసిన ఫొటోలో ఉన్న రెండు తెల్లపులులు సహా నాలుగు పులులు సంచరిస్తున్నట్టు కెమెరాల్లో నమోదైంది.


nani1.2.jpgఅప్పటినుంచి తెల్లపులుల సంచారం కనిపించలేదు. 2021లో అవలాంజి విద్యుత్‌ కేంద్రానికి వెళ్లే దారిలోని విద్యుత్‌ బోర్డు క్వార్టర్స్‌ సమీపంలో తెల్ల పులి సంచరించినట్లు తెలిసినా, అందుకు సంబంధించిన ఆధారాలు లభించలేదు.. ఈ క్రమంలో, కొద్దిరోజుల క్రితం అవలాంజి అటవీ ప్రాంతంలో తెల్లపులి సంచరించే దృశ్యాలు అటవీ శాఖ ఏర్పాటుచేసిన కెమెరాల్లో రికార్డయింది. 2018లో రెండు పులులు కనిపించిన నేపథ్యంలో, ప్రస్తుతం ఒక తెల్లపులి మాత్రమే ఉందని, దానిని రక్షించేలా చర్యలు చేపట్టాలని జంతు ప్రేమికులు అటవీ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థిక సాయం

రైతన్నల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 28 , 2026 | 11:01 AM