Share News

టూరిస్ట్ బస్సు బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు..

ABN , Publish Date - May 28 , 2026 | 07:09 AM

నెల్లూరులోని చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు సమీపంలో ఈ రోజు (గురువారం) ఉదయం బస్సు ప్రమాదానికి గురైంది. కోల్‌కతా-చెన్నై హైవేపై టూరిస్ట్ బస్సు ప్రమాదవశాత్తూ బోల్తాపడింది.

టూరిస్ట్ బస్సు బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు..
Bus Accident in Nellore

నెల్లూరు: నగరంలోని చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు సమీపంలో ఈ రోజు (గురువారం) ఉదయం బస్సు ప్రమాదానికి గురైంది. కోల్‌కతా-చెన్నై హైవేపై టూరిస్ట్ బస్సు ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా ఏలూరు నుంచి నాగపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మరోవైపు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

గంజాయి విక్రయాలపైౖ స్టింగ్‌ ఆపరేషన్‌

నదుల్లో కాలుష్య నియంత్రణకు ‘టాస్క్‌ఫోర్స్‌

Updated Date - May 28 , 2026 | 10:57 AM