Share News

చేవెళ్లలో దారుణం.. మహిళను కారులో తీసుకొచ్చి..

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:47 AM

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ గేటు సమీపంలో నిన్న (ఆదివారం) అర్ధరాత్రి వరంగల్ ప్రాంతానికి చెందిన మహిళ(35)పై దాడికి పాల్పడటంతో గాయాలయ్యాయి.

చేవెళ్లలో దారుణం.. మహిళను కారులో తీసుకొచ్చి..
Chevella Woman Incident

రంగారెడ్డి జిల్లా, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ గేటు సమీపంలో నిన్న (ఆదివారం) అర్ధరాత్రి వరంగల్ ప్రాంతానికి చెందిన మహిళ(35)పై దాడికి పాల్పడటంతో గాయాలయ్యాయి. గాయాలతో ఉన్న మహిళను స్థానిక రైతులు గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎవరో తనని తెల్లకారులో ఇక్కడకు తీసుకువచ్చారని.. ఆ తర్వాత కత్తితో పొడిచేసి వెళ్లారని మహిళ తెలిపింది. ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ ఇవ్వాలని స్థానికులు అడిగితే భయపడుతూ ఫోన్ చేయవద్దని చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సిబ్బందికి ప్రమాదం

యువత రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్‌లో బతకాలి: హరీశ్‌రావు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 12:55 PM