కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. రూ.9,053 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ABN , Publish Date - Nov 09 , 2026 | 08:16 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో సోమవారం పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాలుపంచుకోనున్నారు. నేడు రూ.9,053కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఈరోజు (సోమవారం) పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాలుపంచుకోనున్నారు. నేడు రూ.9,053కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు లఘుచర్ల ఇండస్ట్రీయల్ పార్కులో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నాచారం రేడియల్ రోడ్డు సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 5గంటలకు హకీంపేట్‌లో భారీ రైతు బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు. ఈ సభ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మా హయాంలో పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురి మృతి
సీఎం రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News