చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కాలిపోయిన డాక్యుమెంట్లు
ABN , Publish Date - Nov 09 , 2026 | 09:46 AM
చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో భవనంలో నిల్వ ఉంచిన పాత రికార్డులు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి.
చేవెళ్ల, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో (Chevella Fire Accident) నిన్న (ఆదివారం) రాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో భవనంలో నిల్వ ఉంచిన పాత రికార్డులు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, షాద్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మంటలను ఫైర్ సిబ్బంది పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. టపాసుల నిప్పురవ్వల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఎమ్మార్వో కృష్ణయ్య అనుమానం వ్యక్తం చేశారు. కాలిపోయిన రికార్డులు, ఆస్తి నష్టంపై అధికారులు పరిశీలిస్తున్నారు. పాత ఎమ్మార్వో కార్యాలయంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పలు కేసుల వివరాల డాక్యుమెంట్లు కాలిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మా హయాంలో పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురి మృతి
సీఎం రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News