ఏఐసీసీ షోకాజ్ నోటీసులు.. షబ్బీర్‌అలీ రియాక్షన్ ఇదే..
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:53 PM
ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనోటీసులపై షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు.
కామారెడ్డి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకు (Shabbir Ali) షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు. ఈ ఆడియోలో వినిపిస్తున్న వాయిస్ తనది కాదని, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరే ముందే ఈ ఆడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో తనకు నాలుగు దశాబ్దాలుగా సాన్నిహిత్యం ఉందని, ఆయనను సోదరుడిలా భావిస్తానని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఆయనపై తాను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, ఇద్దరి మధ్య దూరం పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగించే పనులు తాను చేయనని, కాంగ్రెస్ పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, టీపీసీసీ నాయకత్వం, మహిళలపై షబ్బీర్ అలీ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా స్పందించింది. ఈ ఆడియోలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు మహిళా నాయకత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్‌ది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్
వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క
‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News