Share News

మహిళలపై వ్యాఖ్యలు.. షబ్బీర్‌ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:11 PM

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్‌గా స్పందించింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హై కమాండ్ చర్యలకు దిగింది.

మహిళలపై వ్యాఖ్యలు.. షబ్బీర్‌ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు
Shabbir Ali

హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై (Shabbir Ali) ఏఐసీసీ సీరియస్‌గా స్పందించింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హై కమాండ్ చర్యలకు దిగింది.


షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు..

ఈ వైరల్ అయిన ఆడియోలో షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంపై వివరణ ఇవ్వాలని హుకుం జారీ చేసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను పబ్లిక్‌లో చర్చకు తీసుకురావడంపై కూడా ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.


కామారెడ్డి కాంగ్రెస్‌లో వర్గపోరు..

మరోవైపు.. కామారెడ్డి కాంగ్రెస్‌లో వర్గపోరు మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. షబ్బీర్ అలీ వర్గం, చంద్రశేఖర్ రెడ్డి వర్గం మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అదే సమయంలో సొంత పార్టీ నేతలపై విమర్శలు, దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ పరిణామాలతో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. పార్టీ క్రమశిక్షణ చర్యలు, వర్గపోరు, పరస్పర ఆరోపణలతో స్థానిక కాంగ్రెస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

హైదరాబాద్‌కు ఐఐఎం కావాలి.. కేంద్రానికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

విద్యానాణ్యత మెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. డీఈఓలకు కీలక ఆదేశాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 01:43 PM