Share News

అడ్డదారుల్లో ధాన్యం తరలిస్తే కఠిన చర్యలు: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Apr 07 , 2026 | 09:14 PM

: అడ్డదారుల్లో ధాన్యాన్ని తరలిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ధాన్యం ఎగుమతులు,దిగుమతులపై కట్టుదిట్టమైన నిఘా ఉంచామని స్పష్టం చేశారు.

అడ్డదారుల్లో ధాన్యం తరలిస్తే కఠిన చర్యలు: మంత్రి ఉత్తమ్
Telangana Minister Uttam Kumar Reddy

సూర్యాపేట, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): అడ్డదారుల్లో ధాన్యాన్ని తరలిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ధాన్యం ఎగుమతులు, దిగుమతులపై కట్టుదిట్టమైన నిఘా ఉంచామని స్పష్టం చేశారు. ఈ రబీ సీజన్‌లో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉందని తెలిపారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు తమ ప్రభుత్వం సన్నద్ధమైందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అందుబాటులో 16 కోట్ల గన్నీ బ్యాగులు ఉన్నాయని తెలిపారు.


పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక..

అంతకుముందు హుజూర్ నగర్ రామస్వామి గట్టు సమీపంలో ఐటీ కాలేజీతో పాటు మోడల్ కాలనీ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో 116 ఎకరాల్లో నిర్మిస్తున్న 2,160 సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్ల మోడల్ కాలనీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. కాలనీ నిర్మాణానికి రూ.125 కోట్లు ఖర్చు, అదనంగా రూ.20 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఎలాంటి పైరవీలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. మొదటి విడతలో 1500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ నెలాఖరులో మోడల్ కాలనీ ప్రారంభోత్సవం జరుగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 07 , 2026 | 09:18 PM