దర్వేశిపురాన్ని టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి
ABN , Publish Date - Nov 26 , 2026 | 02:33 PM
నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతానని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యుత్తమ సురక్షిత రహదారులను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): నల్గొండ జిల్లాను అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతానని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Telangana Minister Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యుత్తమ సురక్షిత రహదారులను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టూరిజం సర్క్యూట్‌గా దర్వేశిపురాన్ని నిలుపుతానని తెలిపారు.
దర్వేశిపురం రేణుకాఎల్లమ్మ ఆలయం.. గొప్ప ఆధ్యాత్మిక ప్రాంతమని మంత్రి చెప్పుకొచ్చారు. వేల సంఖ్యలో ఈ గుడికి నిత్యం భక్తులు వస్తుంటారని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం 5 ఎకరాల్లో హరిత హోటల్, గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపడతామని వివరించారు. మైల సముద్ర ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్‌గా నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఖేలో ఇండియా గేమ్స్.. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: సీఎం రేవంత్‌రెడ్డి
టెక్నాలజీతో పోలీస్ సేవలు మరింత వేగవంతం: డీజీపీ
నాగర్ కర్నూల్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వరాలు.. రూ.450 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News