Share News

ప్రజల పాపం తగిలి కేసీఆర్ ఫాంహౌస్ పాలయ్యారు: మంత్రి కోమటిరెడ్డి

ABN , Publish Date - Jul 12 , 2026 | 06:04 PM

మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆలేరు, భువనగిరి ప్రజల పాపం తగిలే కేసీఆర్ కాలు విరిగి ఫాంహౌస్ పాలయ్యారని విమర్శించారు.

ప్రజల పాపం తగిలి కేసీఆర్ ఫాంహౌస్ పాలయ్యారు: మంత్రి కోమటిరెడ్డి
Telangana Minister Komatireddy Venkat Reddy

యాదాద్రి జిల్లా, జులై 12 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Telangana Minister Komatireddy Venkat Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆలేరు, భువనగిరి ప్రజల పాపం తగిలే కేసీఆర్ కాలు విరిగి ఫాంహౌస్ పాలయ్యారని విమర్శించారు. బస్వాపూర్, గందమల్లను త్వరలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణను మిగులు బడ్జెట్‌తో అప్పగిస్తే.. కేసీఆర్ రూ.8 లక్షల కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు.


ఈరోజు (ఆదివారం) యాదాద్రి జిల్లాలోని వంగపల్లిలో హ్యామ్ ప్యాకేజీ-1లో భాగంగా రూ. 339.59 కోట్లతో నిర్మించే 109.30 కిలోమీటర్లతో కూడిన 7 రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. తాను ఎంపీగా పోటీ చేస్తే సొంత డబ్బులతో ఆలేరు ప్రజలు గెలిపించారని తెలిపారు. ఎంపీగా ఉన్నప్పుడు కొట్లాడి వంగపల్లి అండర్ పాస్ మంజూరు చేయించినట్లు వెల్లడించారు.


పాలసంఘం చైర్మన్‌గా ఉన్నప్పుడు బీర్ల ఐలయ్య ఎలా ఉన్నారో, ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా అలానే ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి ప్రశంసించారు. బీర్ల ఐలయ్యను మళ్లీ గెలిపిస్తే మంత్రిని చేస్తామని మాటిచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ తాము నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. ఆలస్యమైనా అన్నింటినీ అమలు చేస్తున్నామని తెలిపారు. పదవుల కోసం నేతలు కొట్లాడుకోవద్దని సూచించారు. ఆలేరు, భువనగిరి ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. పేదోళ్లకు నాణ్యమైన విద్యను అందించడానికి నల్గొండలో ఏసీ కండీషన్‌తో స్కూల్ కట్టించానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి.. భూగర్భ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు

డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 07:04 PM