Share News

సూర్యాపేటలో పండగపూట విషాదం.. వ్యాన్ ఢీకొని ఇద్దరు యువకుల మృతి

ABN , Publish Date - Nov 08 , 2026 | 08:18 PM

సూర్యాపేట జిల్లాలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

సూర్యాపేటలో పండగపూట విషాదం.. వ్యాన్ ఢీకొని ఇద్దరు యువకుల మృతి
suryapet accident

సూర్యాపేట, నవంబర్ 8: జిల్లాలోని కోదాడ పరిధిలో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యాన్.. బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే..


పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాలోని కోదాడ పరిధిలో తుమ్మర గ్రామం వద్ద ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యాన్.. అటుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపాలై.. అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కాగా.. బాధితులను అనంతగిరి మండలంలోని కొత్తగూడెం వాసులుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

రావిర్యాల భూములు బ్లాక్‌లో

వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 08:18 PM