ఆ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి క్లారిటీ
ABN , Publish Date - Aug 14 , 2026 | 01:36 PM
కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
యాదాద్రి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి (Munugode MLA Komatireddy Raj Gopal Reddy) వ్యాఖ్యానించారు. నిన్న చేసిన ఈ వ్యాఖ్యలపై మరోసారి మీడియాకు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈరోజు (శుక్రవారం) యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ సీతారామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజ్‌గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు.
ఉద్యమకారులకు గుర్తింపు ఉండాలి..
తానెక్కడా కాంగ్రెస్ నాయకులను విమర్శించలేదని, విమర్శించనని రాజ్‌గోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు. నిజమైన కాంగ్రెస్ నాయకులను అణిచివేస్తున్నారనే విషయాన్ని తాను గుర్తు చేశానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా ఉద్యమకారులకు గుర్తింపు ఉండాలని సూచించారు. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్, ప్రభుత్వం నడపవద్దని కోరారు. ప్రజాపాలన అంటే పేదల కోసం పని చేయాలని సూచించారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లకు సీమాంధ్ర నాయకుల కోసం కాదని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News