Share News

ఖైరతాబాద్ ఉప ఎన్నికలోనూ గెలిచేది కాంగ్రెస్సే: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:44 PM

ఖైరతాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌దే విజయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చనిపోయినా సింపతీ లేకుండా కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని చెప్పుకొచ్చారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నికలోనూ గెలిచేది కాంగ్రెస్సే: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy

నల్లగొండ, అక్టోబర్ 2: ఖైరతాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌దే విజయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు(శుక్రవారం) ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మాట్లాడుతూ.. సిట్టింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చనిపోయినా సింపతీ లేకుండా కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని చెప్పుకొచ్చారు. దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికలోనూ గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. డిసెంబర్ నాటికి హైదరాబాద్ -విజయవాడ 65 హైవేపై అన్ని బ్లాక్ స్పాట్స్ పనులు పూర్తి అవుతాయని చెప్పారు. ఎస్ఎల్‌బీసీ పనులు 600 మీటర్లు పూర్తి చేశామన్నారు. జూన్ 2028 నాటికి ఎస్ఎల్‌బీసీ పూర్తి చేస్తామని ప్రకటించారు.


అమెరికాలో ఐదేళ్లు జాబ్ చేస్తే మూడు ఫైవ్ స్టార్ హోటల్స్ కొనొచ్చు అంటే అంతా అమెరికా పోతారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్లు అమెరికాలో ఉన్నవాళ్లు కూడా చిన్న ఇళ్లు కొనలేరని... కేటీఆర్ సంపన్నుడని ఆయనే ఒప్పుకున్నారని అన్నారు. కేటీఆర్ ధనికుడు, వందల ఎకరాలు, ఫాంహౌస్‌లు ఉన్నాయని.. కరవు వచ్చినా రైతులకు లక్ష చొప్పున సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులకు సరిపోను కరెంట్ ఇచ్చామని.. ప్రస్తుతం పంటలు కోతకు వచ్చాయని తెలిపారు. పక్క రాష్ట్రంలో యూనిట్ రూ.10కి కొని కరెంట్ ఇచ్చామన్నారు. పోయిన సారి కంటే వరి సాగు 5% తగ్గిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

కొడంగల్‌లో బీఆర్ఎస్ సభ.. రేవంత్‌కు చెమటలు పట్టిస్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్

మెట్రో-ఆర్టీసీ ప్రయాణానికి కామన్ పాస్.. భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆవిష్కరణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 04:49 PM