Share News

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఏపీ విద్యార్థులకు చోటు.. మంత్రి లోకేశ్ హర్షం..

ABN , Publish Date - Oct 02 , 2026 | 03:58 PM

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్థానం దక్కించుకోవడంపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు.

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఏపీ విద్యార్థులకు చోటు.. మంత్రి లోకేశ్ హర్షం..
World Book of Records

అమరావతి: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్థానం దక్కించుకోవడంపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంలో 170 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు. 35 వేల మంది విద్యార్థులు దాదాపు 75,000 కిలోల పొడి చెత్తను సేకరించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారని వెల్లడించారు.


ఈ సందర్భంగా రికార్డు సృష్టించిన విద్యార్థులందరికీ మంత్రి లోకేశ్ శుభాభినందనలు తెలిపారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, శ్రమదానం పట్ల అవగాహన కల్పించేందుకు ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. దీనిని అందరూ కలిసి ఒక యజ్ఞంలా చేపట్టి విజయవంతం చేశారని అన్నారు. ఈ ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మదనపల్లె హార్టికల్చర్ శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి లోకేశ్

70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన.. మరో 193 మందిపై చర్యలు

Updated Date - Oct 02 , 2026 | 04:02 PM