Share News

కొడంగల్‌లో బీఆర్ఎస్ సభ.. రేవంత్‌కు చెమటలు పట్టిస్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్

ABN , Publish Date - Oct 02 , 2026 | 03:02 PM

బీఆర్‌ఎస్ సభతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెమటలు పట్టిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలోనే కొడంగల్‌లో బీఆర్ఎస్‌ సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కొడంగల్‌లో బీఆర్ఎస్ సభ.. రేవంత్‌కు చెమటలు పట్టిస్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav

హైదరాబాద్, అక్టోబర్ 2: బీఆర్‌ఎస్ సభతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెమటలు పట్టిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. త్వరలోనే కొడంగల్‌లో బీఆర్ఎస్‌ సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించవచ్చని.. సిరిసిల్లలో బలప్రదర్శన చేయాల్సిన అవసరం లేదన్నారు. సిరిసిల్ల ఏమైనా పక్క రాష్ట్రంలో ఉందా అని ప్రశ్నించారు. రేవంత్.. సిద్దిపేటలో కూడా సభ పెడతానంటున్నారని అన్నారు. సిద్దిపేట సభ తర్వాత కొడంగల్‌లో బీఆర్ఎస్ సభ ఉంటుందని ప్రకటించారు. సిరిసిల్ల సభతో రేవంత్‌కు వచ్చిన మైలేజ్ కంటే నష్టమే ఎక్కువన్నారు.


తాము కొడంగల్‌లో పెట్టే సభతో ముఖ్యమంత్రికి చెమటలు పడతాయని తలసాని అన్నారు. ఖైరతాబాద్ బైపోల్స్‌లో వంద శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలు మారటంతో దానం నాగేందర్‌పై ఖైరతాబాద్ ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకోని వారు కూడా బైపోల్స్‌లో కసితో ఓటు వేస్తారన్నారు. జూజ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉపఎన్నిక పరిస్థితి వేరని చెప్పుకొచ్చారు. డబ్బులు ఇచ్చినా ఈసారి ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేయరన్నారు. ‘అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసేంత సీన్ మేము ఏం చేశాం? బయట జరిగిన గొడవకు స్పీకర్‌కు ఏం సంబంధం’ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

‘కెప్టెన్ మచ్చార్ ధైర్యాన్ని ఎందుకు మెచ్చుకోలేదు’.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్.. సెంట్రల్ కిచెన్లపై సీఎం రేవంత్ ఆదేశాలివే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 03:51 PM