Share News

మదనపల్లె హార్టికల్చర్ శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి లోకేశ్

ABN , Publish Date - Oct 02 , 2026 | 01:21 PM

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ మేరకు మదనపల్లెలో హార్టికల్చర్ ఏర్పాటుకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మదనపల్లె హార్టికల్చర్ శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి లోకేశ్
lokesh at madanapalle

అన్నమయ్య జిల్లా, అక్టోబర్ 2: ప్రదాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు కాబోతుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.


మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. మదనపల్లె ఎంతో ఘన చరిత్ర కలిగి ఉందని.. త్యాగానికి, పోరాటాలకు మారుపేరు ఈ గడ్డ అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన.. గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపితకు నివాళులర్పించారు. రైతులు బాగుంటే దేశం బాగుంటుందని నాడు గాంధీ అన్నారని గుర్తుచేశారు. పాదయాత్రలో చాలా ఇబ్బందులకు గురిచేశారని లోకేశ్ తెలిపారు. అయినప్పటికీ ప్రజల ఆశీస్సులతో వాటిని ఎదుర్కోగలిగామని లోకేశ్ పేర్కొన్నారు.


రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని ఆనాడే చెప్పామని.. ఈ రోజు మోదీ ఆశీస్సులతో ఆ కల నెరవేరుతోందని మంత్రి లోకేశ్ అన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు దేవాలయాలుగా భావిస్తారని.. డ్రిప్‌ ఇరిగేషన్‌ను పరిచయం చేసిన వ్యక్తి ఆయనేనని లోకేశ్ గుర్తుచేశారు. మన ముఖ్యమంత్రిని వాటర్‌‌మన్‌ అని పిలుస్తుంటే వైసీపీ ఓర్వలేకపోతోందని లోకేశ్ దుయ్యబట్టారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపుపై మంత్రి సంధ్యారాణి హర్షం

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక ఆదేశాలు.. రేపే సుప్రీంకోర్టులో పిటిషన్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 02:52 PM