Share News

సంగారెడ్డిలో దారుణం.. భర్తను చంపి.. కరెంట్ షాక్ డ్రామా ఆడిన భార్య

ABN , Publish Date - Nov 23 , 2026 | 07:26 PM

సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లాలో పెట్రోల్ పోసి నిప్పంటించి భర్త జరప్పను సజీవదహనం చేసి.. కరెంట్ షాకుతో మృతి చెందారంటూ భార్య నాటకమాడింది. ఈనెల 10వ తేదీన కంగ్టి మండలం దెగుల్‌వాడిలో భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

సంగారెడ్డిలో దారుణం.. భర్తను చంపి.. కరెంట్ షాక్ డ్రామా ఆడిన భార్య
Sangareddy Husband Case

సంగారెడ్డి జిల్లా, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లాలో పెట్రోల్ పోసి నిప్పంటించి భర్త జరప్పను సజీవదహనం చేసి.. కరెంట్ షాకుతో మృతి చెందారంటూ భార్య నాటకమాడింది. ఈనెల 10వ తేదీన కంగ్టి మండలం దెగుల్‌వాడిలో భర్త అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు ఈ కేసును ముమ్మరంగా విచారించారు. ఈ దర్యాప్తులో భర్తను చంపింది భార్యగా నిర్దారించారు.


మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త జరప్ప (46)పై పెట్రోల్ పోసి భార్య బుజ్జమ్మ నిప్పంటించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కరెంట్ షాకుతో భర్త మరణించాడని నమ్మించేందుకు మంచంపై విద్యుత్ వైర్లను ఆమె ఏర్పాటు చేసింది. ప్రతి రోజూ తాగి వచ్చి తనతో గొడవపడుతోండటంతో విసిగిపోయి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లుగా ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసుల విచారణలో భార్య బుజ్జమ్మ ఈ నేరాన్ని అంగీకరించింది. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు కంగ్టి పోలీసులు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 07:37 PM