Share News

మూడేళ్లయినా.. నో ‘కేవైసీ’!

ABN , Publish Date - Jul 21 , 2026 | 01:39 PM

నిజమైన లబ్ధిదారులకే రేషన్‌ అందేలా చూడటం కోసం రేషన్‌కార్డుదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మూడేళ్లయినా.. నో ‘కేవైసీ’!

  • రేషన్‌ ఈ-కేవైసీపై లబ్ధిదారుల నిర్లిప్తత

  • సంగారెడ్డి జిల్లాలో 77.33 శాతం, మెదక్‌ జిల్లాలో 80 శాతమే..

  • ఈ నెల 31 వరకు గడువు పొడగింపు.. లేదంటే రేషన్‌ కట్‌!

సంగారెడ్డి: నిజమైన లబ్ధిదారులకే రేషన్‌ అందేలా చూడటం కోసం రేషన్‌కార్డుదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్డులోని సభ్యులందరూ రేషన్‌ దుకాణానికి వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచిందింది. కానీ, ఈ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. రేషన్‌కార్డులో సభ్యులకు అన్నపూర్ణ కార్డుదారులకు ఒక్కో యూనిట్‌కు 10 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారులకు ఒక్కో యూనిట్‌కు 35 కిలోలు, ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా రేషన్‌ బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అయితే, కార్డుల్లో సభ్యులుగా ఉన్నవారు చనిపోయినా వారి పేర్లు కార్డులో కొనసాగుతున్నాయి.


వారికి పేరిట కుటుంబ సభ్యులు రేషన్‌ కోటా తీసుకుంటున్నారు. ఇలాంటి వారిని గుర్తించి తొలగించేందుకు ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. ఈమేరకు లబ్ధిదారులు రేషన్‌ దుకాణానికి వెళ్లి ఈ పాస్‌ మిషన్‌లో వేలి ముద్ర వేయడం ద్వారా కేవైసీ నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ, రేషన్‌కారు లబ్ధిదారులు ఈ-కేవైసీ చేసుకోవడంలో నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. మూడేళ్లలో పలుమార్లు గడువు పొడిగించినా ఇంకా వందశాతం పూర్తికాలేదు. తాజాగా ఈ నెల 31 వరకు ప్రభుత్వం పొడగించింది. అప్పటికీ ఈ-కేవైసీ పూర్తిచేయకపోతే లబ్ధిదారులకు రేషన్‌ నిలిచిపోయే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.


వేలాది మంది దూరం

సంగారెడ్డి జిల్లాలో 15,08,162 మంది రేషన్‌కార్డు లబ్ధిదారులు ఉండగా ఇప్పటివరకు 11,66,189 మంది (77.33 శాతం) ఈ-కేవైసీ నమోదు చేసుకున్నారు. ఇంకా ఇంకా 3,41,973 మంది ఈ-కేవైసీ చేసుకోలేదు. మెదక్‌ జిల్లాలో రేషన్‌ ఈకేవైసీ 80.03 శాతం పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 2,41,832 కార్డులు... 7,90,304 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకు ఈ-కేవైసీ చేసుకున్నవారు 6,32,457 మంది, ఇంకా 1,57,847 మంది కేవైసీ పూర్తిచేయలేదు. కొన్నిచోట్ల మృతిచెందిన వారి పేరిట ప్రతీ నెల ఉచితంగా రేషన్‌ తీసుకుంటున్నారు. ఎవరైతే ఈ-కేవైసీ నమోదు చేసుకోరో వారి కోటాను నిలిపివేయనున్నారు.


rice1.jpg

మరోసారి మూడు నెలల రేషన్‌!

సంగారెడ్డి: తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులకు మరోసారి మూడు నెలల రేషన్‌ ఒకేసారి ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈమేరకు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లాలో 4,47,375 తెల్ల రేషన్‌ కార్డులు ఉండగా, 15,08,162 మందికి ప్రతీ నెల సుమారు 9,542 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. మెదక్‌ జిల్లాలో 2,41,832 తెల్లకార్డుల్లో 7,90,304 లబ్ధిదారులకు 4వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇస్తున్నారు.


ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల బియ్యం... ఒకేసారి ఆగస్టులో ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గత వేసవిలోనూ మూడు నెలల రేషన్‌ ఒకేసారి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో లబ్ధిదారులు ప్రతీనెల రేషన్‌ దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం తప్పనుంది. కానీ, మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఒకేసరి ఇవ్వడంతొ రేషన్‌దుకాణాల్లో స్థలం లేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

రాజీవ్‌ యువ వికాసంపై నీలినీడలు

నియమ నిష్ఠలతో అమ్మవారి సేవలో..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 01:39 PM