గజ్వేల్ రింగ్ రోడ్డు పనులపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి: రఘునందన్ రావు
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:34 PM
గజ్వేల్ అభివృద్ధికి ఈ రింగ్ రోడ్డు కీలకమైనదని..నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఈరోజు(శనివారం) గజ్వేల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును రఘునందన్ రావు పరిశీలించారు.
సిద్దిపేట జిల్లా: గజ్వేల్ అభివృద్ధికి ఈ రింగ్ రోడ్డు కీలకమైనదని..నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు (MP Raghunandan Rao) తెలిపారు. ఈరోజు(శనివారం) గజ్వేల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును రఘునందన్ రావు పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల నర్మెట్టకు వచ్చినప్పుడు అసంపూర్తిగా ఉన్నా గజ్వేల్ రింగ్ రోడ్డు వ్యవహారం గురించి వివరించానని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పుడు పరిష్కరిస్తామని సభ వేదికగా చెప్పారని ప్రస్తావించారు.
రింగ్ రోడ్డు పూర్తి కావడానికి 151 మీటర్ల భూ సేకరణ పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. ఒక రైతుని పిలిచి ఒప్పించడంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. రింగ్ రోడ్డు వ్యవహారంలో సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి తానే స్వయంగా వచ్చి పరిశీలించానని తెలిపారు. జిల్లా ఎంపీగా భూమి ఇచ్చే రైతుతో మాట్లాడి ఈ పనులపై చొరవ తీసుకుంటానని అన్నారు. ఒక వేళ రైతు భూమి ఇచ్చే వ్యవహారంలో అంగీకరించని పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తానని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు
సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ
హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో వల.. హిందూ అమ్మాయిలే టార్గెట్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News