Share News

కంది పంటపైనే ఆశలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 01:47 PM

ఖరీఫ్ లో రైతులు పత్తి, మొక్కజొన్న పంటల్లో అంతర పంటగా కందిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. తేలికపాటి ఎర్ర నేలలు కంది సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి.

కంది పంటపైనే ఆశలు
Agriculture, Medak

  • జిల్లాలో 18,931 ఎకరాల్లో సాగు

  • పూత, కాత దశలో పంట

జగదేవ్‌పూర్‌(మెదక్): ఖరీఫ్ లో రైతులు పత్తి, మొక్కజొన్న పంటల్లో అంతర పంటగా కందిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. తేలికపాటి ఎర్ర నేలలు కంది సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. తక్కువ పెట్టుబడి, కూలీల అవసరం తక్కువగా ఉండటంతో పాటు ఇతర పంటలతో పోలిస్తే కందికి మంచి ధర లభిస్తుండటంతో రైతులు సాగుపై మక్కువ చూపుతున్నారు.

జిల్లాలో ఈ ఏడాది 18,931 ఎకరాల్లో కంది సాగవుతుంది. గజ్వేల్‌ డివిజన్‌లోని జగదేవ్‌పూర్‌, మర్కుక్‌, వర్గల్‌, కుకునూరుపల్లి, కొండపాక మండలాల్లో రైతులు దీన్ని విస్తృతంగా సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంట పూత, కాత దశలో ఉంది. ప్రస్తుత వాతావరణం, మంచు ప్రభావంతో ఆకుచుట్టూ పురు గు సహా తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉందని, రైతు లు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈసారి వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో పత్తి, మొక్కజొన్న దిగుబడులు అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉండటంతో, అన్నదాతలు పూర్తిగా కందిపైనే ఆశలు పెట్టుకున్నారు. మండల వ్యవసాయఅధికారి వసంతరావు పలు సస్యరక్షణ చర్యలను సూచించారు.


సస్యరక్షణ చర్యలు ఇలా...

కంది పంటలో ఆకుచుట్టూ పచ్చ పురుగు నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మరుకమచ్చల పురుగు నివారణకు హెమామె క్లీనంజోమెట్‌, ప్రొక్టమ లేదా బెంజర్‌ 0.4 గ్రాములు లీటరు నీటలో కలిపి పిచికారీ చేయాలి.


kan.jpgకాయ తొలిచే పురుగు..

లార్వా కాయలు తొలిచి బీజాలను తింటుంది, కనిపించిన పురుగును చేతితో తొలగించాలి. స్పైనోసాడ్‌ 45 ఎస్సీ 2.5 మి.లీ ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.4 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. లిగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి.


కాయ తుప్ప...

ఈ పురుగు లార్వా కాయల్లో ఉండి బీజాలను పొడిగా మారుస్తుంది. నివారణకు క్వినాల్‌ఫాస్‌ 25 ఈసీ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించి పంటను పురుగుల భారి నుంచి కాపాడుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

అధిక ధరలకు బియ్యం విక్రయాలు

అర్హులకు ‘చేయూత’.. కొత్త పింఛన్ల మంజూరుకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 01:47 PM