Share News

బ్లో అవుట్ ఘటన.. తక్షణమే సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలన్న డిప్యూటీ సీఎం పవన్

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:08 PM

కోనసీమ జిల్లాలో బ్లో అవుట్ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరుస బ్లో అవుట్ ఘటనల నేపథ్యంలో భద్రతా చర్యలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు.

బ్లో అవుట్ ఘటన.. తక్షణమే సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలన్న డిప్యూటీ సీఎం పవన్
Deputy CM Pawan Kalyan

అమరావతి, నవంబర్ 17: కోనసీమ జిల్లాలో బ్లో అవుట్ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరుస బ్లో అవుట్ ఘటనల నేపథ్యంలో భద్రతా చర్యలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. తీవ్రత, పరిసర గ్రామాల ప్రజల భద్రత తదితర అంశాలపై డిప్యూటీ సీఎం.. జిల్లా కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.


ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గ్యాస్ వెలువడినట్లు కలెక్టర్ తెలిపారు. గ్యాస్ లీకేజీ ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలందరినీ నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు అధికారులు వివరించారు. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు పవన్‌కు కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే ఓఎన్జీసీ సాంకేతిక బృందం బావి వద్దకు చేరుకుని గ్యాస్ లీకేజీని అరికట్టే ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. మరో ఐదు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు.


ఇటీవల తరచూ గ్యాస్ లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఓఎన్జీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

విశాఖలో 20 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి

రెండు తుపాన్లను ఎదుర్కొన్నాం.. ఈ తుపానుకు సన్నద్ధంగా ఉండాలి.. అధికారులతో హోంమంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 01:01 PM