పారిశ్రామికవాడలో చిరుత కలకలం
ABN , Publish Date - Mar 06 , 2026 | 10:43 AM
పారిశ్రామిక ప్రాంతాలు కాజీపల్లి, గడ్డపోతారం పరిధిలో చిరుత సంచారం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తుండగా.. గురువారం దూడ పై దాడి చేసి చంపివేసిన ఘటన కార్మిక వర్గలు, స్థానిక గ్రామాలలో కలకలం రేపింది.
కాజీపల్లి శివార్లలో దూడపై దాడి
అర్బన్ పార్కులో సంచారం
రెండేళ్ల క్రితం హెటీరో పరిశ్రమలో దూరి హల్‌చల్
ఆందోళనలో గ్రామస్థులు, కార్మికులు
జిన్నారం(సంగారెడ్డి): పారిశ్రామిక ప్రాంతాలు కాజీపల్లి, గడ్డపోతారం పరిధిలో చిరుత సంచారం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తుండగా.. గురువారం దూడ పై దాడి చేసి చంపివేసిన ఘటన కార్మిక వర్గలు, స్థానిక గ్రామాలలో కలకలం రేపింది. జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీ కాజీపల్లి గ్రామ శివారులో కాజీచెరువు సమీపంలో గత వారం రోజులుగా చిరుత సంచారం స్థానికులు గుర్తించారు. పశువుల కాపరులకు కనిపించిన చిరుత బండ రాళ్లపై సంచారాన్ని గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా గురువారం కాజీపల్లికి చెందిన రైతు ఎర్రోళ్ల వేణు దూడ పై దాడి చేసి చంపి వేసిన ఘనట స్థానికంగా భయాందోళనలు కలిగిస్తుంది.
పరిశ్రమల సమీపంలో చిరుతల సంచారం
గడ్డపోతారం, కాజీపల్లి పరిఽధిలో రెండు పారిశ్రామికవాడల్లో 120 వరకు పరిశ్రమలున్నాయి. నిత్యం వేలాది మంది కార్మికులు విధులకు వెళ్తుంటారు. రెండేళ్ల క్రితం కూడా కాజీపల్లి అర్బన్ పారెస్ట్‌లో చిరుత రెండు వారాల పాటు సంచరించింది. హెటీరో పరిశ్రమలో దూరగా సిబ్బంది గమనించి తలుపులు మూయగా, అనంతరం అధికారులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు. అదే ప్రాంతంలో మరోసారి చిరుత సంచరించడంతో వారం రోజులుగా భయం నెలకొన్నది. జనవాసాలకు సమీపంలో ఉండటంతో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలకు వచ్చే కార్మికులు 24 గంటల పాటు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. ఔటర్ రింగురోడ్డుపై ప్రయాణించేవారు, హైదరాబాద్‌కు వెళ్లే వారు కూడా భయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరోసారి తగ్గిన బంగారం, వెండి రేట్లు.. నేటి ధరలివే..
Read Latest Telangana News and National News