Share News

మరోసారి తగ్గిన బంగారం, వెండి రేట్లు.. నేటి ధరలివే..

ABN , Publish Date - Mar 06 , 2026 | 10:02 AM

ఇటీవల వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి రేట్లు.. శుక్రవారం మరోసారి దిగొచ్చాయి. నేటి ఉదయం 10:00 గంటల సమయంలో మార్కెట్లో పసిడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే...

మరోసారి తగ్గిన బంగారం, వెండి రేట్లు.. నేటి ధరలివే..
Gold and Silver Rates Today

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో తొలుత భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మరోసారి నేలచూపులు చూస్తున్నాయి. గురువారం నాడు ఓ మోస్తరుగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు శుక్రవారం కూడా అదే ధోరణిని కనబరిచాయి. ఉదయం 10:00 గంటల సమయంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధరపై రూ.10 తగ్గి.. రూ.1,62,870గా ఉండగా.. 22 క్యారెట్ల పది గ్రాముల ధర కూడా అదే స్థాయిలో పడిపోయి రూ.1,49,290 వద్ద ట్రేడవుతోంది. ఇక.. కిలో వెండిపై రూ.100 పతనమై ప్రస్తుతం రూ.2,84,900గా ఉంది(Gold and Silver Rates Today).


ఆయా ప్రధాన నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములకు) ధరలు ఇలా..

  • హైదరాబాద్: ₹1,62,870; ₹1,49,290

  • విజయవాడ: ₹1,62,870; ₹1,49,290

  • ఢిల్లీ: ₹1,63,020; ₹1,49,440

  • ముంబై: ₹1,62,870; ₹1,49,290

  • కోల్‌కతా: ₹1,62,870; ₹1,49,290

  • చెన్నై: ₹1,64,940; ₹1,51,190

  • బెంగళూరు: ₹1,62,870; ₹1,49,290

  • కేరళ: ₹1,62,870; ₹1,49,290

  • పుణే: ₹1,62,870; ₹1,49,290


వెండి రేట్లు(కిలోకు) ఇలా..

  • హైదరాబాద్: ₹2,94,900

  • విజయవాడ: ₹2,94,900

  • ఢిల్లీ: ₹2,84,900

  • ముంబై: ₹2,84,900

  • కోల్‌కతా: ₹2,84,900

  • చెన్నై: ₹2,94,900

  • బెంగళూరు: ₹2,84,900

  • కేరళ: ₹2,94,900

  • పుణే: ₹2,84,900


గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే అందించడమైనది. బంగారం ధరలు పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నగరం, మేకర్/జ్యువెలర్ ఆధారంగా రేట్లలో స్వల్ప తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాలని సూచించడమైనది.


ఇవీ చదవండి:

హైదరాబాద్‌లో లోంజా జీసీసీ

భారత తయారీదారుల టర్నోవర్‌లో యాపిల్‌ నం.2

Updated Date - Mar 06 , 2026 | 10:22 AM