హైదరాబాద్‌లో లోంజా జీసీసీ
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:18 AM
ప్రపంచంలోని ప్రముఖ సీడీఎంఓ (కాంట్రాక్ట్ డెవల్‌పమెంట్, తయారీ సంస్థ) కంపెనీ లోంజా గ్రూప్ హైదరాబాద్‌లో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రపంచంలోని ప్రముఖ సీడీఎంఓ (కాంట్రాక్ట్ డెవల్‌పమెంట్, తయారీ సంస్థ) కంపెనీ లోంజా గ్రూప్ హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణకు పెరుగుతున్న ప్రాచుర్యాన్ని ఇది మరింత బలోపేతం చేయనుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లోంజా ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో 20,000 మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తోంది.
సిలికాన్ ల్యాబ్స్ కేంద్రం విస్తరణ: ‘లో పవర్ వైర్‌లెస్’ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికా సంస్థ సిలికాన్ ల్యాబ్స్.. తమ హైదరాబాద్ కేంద్రాన్ని మరింత విస్తరించినట్లు ప్రకటించింది. దీంతో తాము ప్రపంచస్థాయిలో అందిస్తున్న ఇంజనీరింగ్. ఆపరేషన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారిందని సంస్థ సీఈఓ మాట్ జాన్సన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News