Share News

భారత తయారీదారుల టర్నోవర్‌లో యాపిల్‌ నం.2

ABN , Publish Date - Mar 06 , 2026 | 05:14 AM

అమెరికాకు చెందిన ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ భారత్‌లో మరో రికార్డును సొంతం చేసుకుంది. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌...

భారత తయారీదారుల టర్నోవర్‌లో యాపిల్‌ నం.2

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ భారత్‌లో మరో రికార్డును సొంతం చేసుకుంది. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌, టాటా ఎలకా్ట్రనిక్స్‌ భాగస్వామ్యాల ద్వారా భారత్‌లో ఐఫోన్లను తయారు చేస్తున్న యాపిల్‌.. గత ఏడాది మన మార్కెట్‌ నుంచి రూ.3 లక్షల కోట్లకు పైగా మార్కెట్‌ ఆదాయాన్ని గడించింది. టర్నోవర్‌పరంగా దేశంలోని అతిపెద్ద తయారీదారుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకింది. రూ.3.49 లక్షల కోట్ల మార్కెట్‌ రెవెన్యూతో టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్‌ (టీఎంపీవీ) అగ్రస్థానంలో ఉంది. కాగా, హిందాల్కో (రూ.2.61 లక్షల కోట్లు), టాటా స్టీల్‌ (రూ.2.25 లక్షల కోట్లు), మహీంద్రా అండ్‌ మహీంద్రా (రూ.1.86 లక్షల కోట్లు) వరుసగా 3,4,5 స్థానాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి...

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 05:15 AM