Share News

రైతన్నల సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి టీజీ భరత్

ABN , Publish Date - Mar 06 , 2026 | 10:16 AM

అచ్యుతాపురం సెజ్‌కు ఐదువేల ఎకరాలు సేకరించారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రస్తావించారు. అప్పటి భూమి ధర ప్రకారం కాకుండా ఇప్పటి ధర ప్రకారం రైతన్నలు పరిహారం అడుగుతున్నారని తెలిపారు.

రైతన్నల సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి టీజీ భరత్
AP Minister TG Bharat

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఆర్థిక మండళ్లకు భూ సేకరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారంపై ఏపీ అసెంబ్లీలో చర్చించారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, యనమల దివ్య ప్రశ్నించారు. గత పదిహేను సంవత్సరాలుగా పరిహారం ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేలు చెప్పారు. రైతులు చాలామంది చనిపోయారని, వారి వారసులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. స్థానికంగా తాము రైతులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాలకు ఒకే పాలసీ పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు.


ఐదువేల ఎకరాలు సేకరించారు: మంత్రి టీజీ భరత్

ఈ విషయంపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమాధానం ఇచ్చారు. అచ్యుతాపురం సెజ్‌కు ఐదువేల ఎకరాలు సేకరించారని ప్రస్తావించారు. అప్పటి భూమి ధర ప్రకారం కాకుండా ఇప్పటి ధర ప్రకారం రైతన్నలు పరిహారం అడుగుతున్నారని తెలిపారు. ఈ విషయంపై అన్నదాతలతో అధికారులు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయంలో సంప్రదింపులు చేయాలని కోరారు. కాకినాడ సెజ్ కోసం 4 వేల ఎగరాలను రైతన్నల నుంచి తీసుకున్నారని ప్రస్తావించారు. అక్కడ కూడా కొందరు రైతులకు పరిహారం అందలేదన్నారు. వారి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి టీజీ భరత్ పేర్కొ్న్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్

ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 10:24 AM