మీకు అంతా తెలుసుగా!
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:59 AM
‘మద్యం కుంభకోణం ఎలా జరిగిందో అంతా మీకు తెలుసుగా.. నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు.. నాకు తెలిసిందంతా గతేడాదే కోర్టులో వాంగ్మూలం ఇచ్చేశా..’
నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు
విచారణకు సహకరించనివాసుదేవ రెడ్డి
7 గంటల్లో 70 ప్రశ్నలు
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ‘మద్యం కుంభకోణం ఎలా జరిగిందో అంతా మీకు తెలుసుగా.. నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు.. నాకు తెలిసిందంతా గతేడాదే కోర్టులో వాంగ్మూలం ఇచ్చేశా..’ అంటూ లిక్కర్ స్కామ్ నిందితుడు, ఏపీఎ్‌సబీసీఎల్ మాజీ ఎండీ సిట్ అధికారుల విచారణలో తెలిపారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి అధికారులు ఏ ప్రశ్న అడిగినా తెలిసిందంతా కోర్టులో చెప్పేశానంటూ ఒకే సమాధానంతో రోజంతా విసిగించినట్లు తెలిసింది. మద్యం కుంభకోణంలో ఏ-2గా ఉన్న వాసుదేవ రెడ్డిని సిట్ అధికారులు ఫిబ్రవరి 21న అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రెండు రోజుల కస్టడీకి తీసుకుని ప్రశ్నించగా మొదటి రోజైన గురువారం దాదాపు ఏడు గంటల పాటు 70కి పైగా ప్రశ్నలు అడిగినా ఏడింటికి కూడా సరైన సమాధానమివ్వలేదని తెలిసింది. దీంతో శుక్రవారం మరిన్ని ప్రశ్నలు సంధించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.