Share News

బీఆర్ఎస్ కీలక భేటీ.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం

ABN , Publish Date - Sep 06 , 2026 | 03:17 PM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ చర్చించారు.

బీఆర్ఎస్ కీలక భేటీ.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం
KCR Farmhouse Meeting

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అధ్యక్షతన ఈరోజు (ఆదివారం) ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పలువురు కీలక నేతలు హాజరయ్యారు. అంతకుముందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భోజనం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.


రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే అంశాలపై కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. రైతులు, యువత, విద్యార్థులు, మహిళల సమస్యలను సభలో లేవనెత్తాలని సూచించారు.


22ఏ భూముల అంశంపై అసెంబ్లీని స్థంభింపచేయాలని కేసీఆర్ నిర్దేశించారు. ప్రభుత్వ హామీలు, పెండింగ్ పథకాలపై నిలదీయాలని పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌పై పోరాటానికి కేసీఆర్ వ్యూహరచన చేశారు. ఈ సారి కూడా శాసనసభకు హాజరుకాకూడదని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫాంహౌస్ నుంచే గులాబీ బాస్ పార్టీ వ్యూహం రచిస్తారని తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అనే మొక్కను మొలవనివ్వను: సీఎం రేవంత్‌రెడ్డి

చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త మార్గదర్శకాలు

గణేశ్ ఉత్సవాలపై సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు.. నెల రోజుల పాటు విజిబుల్ పోలీసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 03:53 PM